దళపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా ‘జననాయకుడు’ సర్‌ప్రైజ్

ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘జ‌న నాయ‌కుడు’. ఈ చిత్రాన్ని హిస్టారిక‌ల్ మూవీగా అంద‌రూ అభివ‌ర్ణిస్తున్నారు. అందుకు కార‌ణం ఆయ‌న న‌టిస్తోన్న చివ‌రి చిత్ర‌మిది. ద‌ళ‌ప‌తి విజ‌య్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మేక‌ర్స్ ‘ఫ‌స్ట్ రోర్‌’ గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. ఇప్పుడీ గ్లింప్స్ ఇంట‌ర్నెట్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. ఆయ‌న చివ‌రి చిత్రం కావ‌టంతో ఈ లెజెండ్రీకి వీడ్కోలు పల‌క‌టానికి బీజం చేసిన‌ట్లు గ్లింప్స్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. 65 సెక‌న్ల వ్య‌వ‌ధి ఉన్న ‘జ‌న నాయ‌కుడు’ ఫ‌స్ట్ రోర్ వీడియోను గ‌మ‌నిస్తే.. ‘నా హృద‌యంలో ఉండే..’ అనే మాట‌లు విజ‌య్ వాయిస్‌లో మ‌న‌కు వినిపిస్తాయి. పోలీస్ డ్రెస్‌లో లాఠీ ప‌ట్టుకుని యుద్ధ వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పించే ప్ర‌దేశంలో న‌డుస్తూ వ‌స్తుంటారు. ఈ విజువ‌ల్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. శ‌క్తి, శాంతి, గంభీరత‌ను క‌ల‌గ‌లిపేలా ఉన్న ఈ స‌న్నివేశం చూస్తుంటే జ‌న నాయ‌గ‌న్ మూవీ ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి సాధార‌ణ వీడ్కోలు కాబోద‌నే సంకేతాన్ని స్ప‌ష్టంగా ఇస్తోంది.

ఫ‌స్ట్ రోర్ వీడియోతో పాటు విడుద‌లైన బ‌ర్త్ డే పోస్ట‌ర్ మ‌రింతగా మెప్పిస్తోంది. పెద్ద సింహాస‌స‌నం మీద ద‌ళ‌ప‌తి విజ‌య్ ఠీవిగా కూర్చుని చేతిలో క‌త్తిని ప‌ట్టుకున్నాడు. ఇన్‌టెన్స్ బ్యాక్‌డ్రాప్‌లో కూర్చున్న విజ‌య్ చుట్టూ పొగ ఆవ‌రించబ‌డి ఉంది. ఈ పోస్ట‌ర్ చూస్తుంటే ఓ రాజు, యోధుడు, నాయ‌కుడు క‌లిసిన వ్య‌క్తిత్వం ఉన్న వ్య‌క్తి మ‌న కథానాయ‌కుడ‌ని ప‌వ‌ర్‌ఫుల్ పోస్ట‌ర్ చూస్తుంటే స్ప‌ష్ట‌మ‌వుతుంది. జ‌న‌నాయ‌కుడు.. ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తోన్న చివ‌రి చిత్రం కావ‌టంతో దీని చుట్టూ ఓ భావోద్వేగం నిండి ఉంది. ఇది కేవ‌లం సినిమా మాత్ర‌మే కాదు, స్టార్‌డ‌మ్‌కి అర్థాన్ని మార్చేసిన హీరో కెరీర్‌కి ఇస్తున్న ముగింపుగా భావిస్తున్నారు. ఇది ఓ వ్య‌క్తి ఉద్య‌మంగా మారాడో తెలియ‌జేస్తుంది. భావోద్వేగ‌మైన క‌థ‌ల‌ను చెప్ప‌టంలో దిట్ట అయిన హెచ్‌.వినోద్ జ‌న నాయ‌గ‌న్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా అనిరుద్ ర‌విచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. విజ‌య్‌, అనిరుద్ కాంబోలో ఇది వ‌ర‌కే ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ పాట‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఈ కాంబో ప్రేక్ష‌కులంద‌రికీ అద్భుత‌మైన అనుభూతినివ్వ‌నుంది.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *