‘హరిహర వీరమల్లు’ పార్ట్ 1 కొత్త విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకులు. ఈ సినిమాని జులై 24న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇవాళ (శనివారం) ఉదయం ప్రకటించారు. వాస్తవానికి ఈ నెల 12నే విడుదల కావాల్సిన ఈ చిత్రం అప్పుడు కూడా వాయిదా పడి ఎట్టకేలకు విడుదల డేట్ ఫిక్స్ చేసుకుంది. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వలన సినిమా షూటింగ్ పూర్తవడానికి దాదాపు ఐదేళ్లు పట్టింది. ఇటీవలే షూటింగ్ పూర్తైంది. వెంటనే రిలీజ్ డేట్ ప్రకటించారు కానీ పెద్దగా సమయం లేకపోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ పడింది. దీంతో సినిమాను మరోసారి వాయిదా వేశారు.
పవన్ అభిమానులకు క్వాలిటీ చిత్రాన్ని అందించేందుకు సినిమా విడుదలను వాయిదా వేసినట్టు ఆ సమయంలో మేకర్స్ ప్రకటించారు. మొత్తానికి కొత్త విడుదల తేదీ ప్రకటించడంతో అభిమానులు చాలా హ్యాపీ ఫీలవుతున్నారు. హరి హర వీరమల్లు’ నుంచి వచ్చే ప్రతి కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఆ అంచనాలకు తారాస్థాయికి తీసుకెళ్ళేలా.. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ త్వరలో విడుదల కాబోతుంది. అంతేకాదు, చిత్ర విడుదల తేదీని కూడా తాజాగా నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ప్రజావాణి చీదిరాల