ఇది నా సినిమా అని శేఖర్ కమ్ముల ధైర్యంగా చెప్పుకోవచ్చు…
విడుదల తేది– 20–06–2025
నటీనటులు– నాగార్జున, ధనుష్, రష్మిక మండన్న, జిమ్ సర భ్, సునయన, నాజర్, దలిప్ తహిల్, తదితరులు
ఎడిటర్– కార్తీక శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ– నికేత్ బొమ్మి
సంగీతం– దేవి శ్రీ ప్రసాద్
నిర్మాత– అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్పి
దర్శకత్వం– శేఖర్ కమ్ముల
కథ–
దేశంలో అధికార దుర్వినియోగం జరిగేది బడా బిజినెస్ బాబుల చేతుల్లోనుండే అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. చట్టాలన్నీ డబ్బున్నవాళ్ల చుట్టూ తిరిగుతూ ఉండే సమాజంలో మనమంతా బతుకుతున్నాం. దేశంలోని పెద్ద పెద్ద కంపెనీల కోసం రాజకీయ నాయకులు వెనుకనుండి ఎలా పనిచేస్తారో తెలిపే కథే కుబేర కథ అనుకోండి. ఎందుకంటే సిన్సియర్‌గా పనిచేసే ఎంతోమంది ఆఫీసర్లను బదిలీల పేరుతో, పై ఆఫీసర్లు, అధికార్లు, మంత్రులు వారి పనిని వారు చేయకుండా ఎలా అడ్డుకుంటారో గతంలో ఎన్నో సినిమాల్లో చూశాం. కుబేర సినిమాలో నాగార్జున పోషించిన (దీపక్ తేజ్) రోల్కూడా అటువంటిదే. సీబిఐ ఆఫీసర్‌గా రాష్ట్రపతినుండి మెడల్ పొందిన సిన్సియర్ ఆఫీసర్ జైల్లో ఎందుకున్నాడు? జైలు నుండి బయటకు ఎలా వచ్చాడు? వచ్చిన తర్వాత ఆయన ఎవరి కోసం పనిచేశాడు? అనేది నాగార్జున పాయింటాఫ్ కథ. నాగార్జునకు ధనుష్ (దేవా) ఎలా కలిశారు? రష్మికా మండన్నకు ధనుష్‌కు సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా థియేటర్లోనే చూడాలి?
నటీనటుల పనితీరు–
ఒక మంచి పాత్ర దొరికితే ఆ పాత్రలోకి దూరిపోయి ఆ పాత్రలో వేరేవారిని ఊహించుకోలేనంతగా నటించటం ధనుష్‌కు కొత్తేం కాదు. అంత బాగా దేవా పాత్రలో నటించారు ధనుష్. ముఖ్యంగా ఇలాంటి పాత్రను ఒప్పుకుని చేయటానికి హీరోకి గట్స్ ఉండాలి. అలాంటి గట్స్ ఉన్న హీరోలు తెలుగులో దొరక్క తమిళ హీరో అయినటువంటి ధనుష్‌ను దేవా పాత్రకి ఎంచుకున్నారా దర్శకుడు శేఖర్ అని సినిమా చూసిన తర్వాత ఎవరైనా అనుకుంటారు. ముఖ్యంగా సినిమాలో ఉన్న కీలకమైన నాలుగు పాత్రలు ఎవరి స్థాయిలో వారు గొప్పగా నటించారు. రష్మికా నటన చూస్తున్నప్పుడు ఏ పాత్రలో ఈ అమ్మాయి భలే ఒదిగిపోతుందే అనుకోవటం ఖాయం. కుబేర సినిమాతో మరో హిట్టు రష్మిక ఖాతలో పడినట్లే.
టెక్నికల్ విభాగం–
ఈ సినిమాలో ఎవరుకూడా నటించటేదు. శేఖర్ కమ్ముల చెప్పిన కథను తూచ తప్పకుండా ఆ నటీనటులు ఆ పాత్రల్లో ఉన్నారంతే. ఎవరు కూడా హీరో హీరోయిన్లా కనిపించలేదు అంటే అది దర్శకుని గొప్పతనం మాత్రమే. అందుకే ఈ సినిమా నాగార్జున సినిమానో, ధనుష్ సినిమానో, రష్మిక సినిమానో కాదు. ఖచ్చితమైన దర్శకుని సినిమా. సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ మార్క్ కనిపించింది. ‘‘పోయిరా పోయిరా మామా…’’ పాట లిరిక్స్ అందించిన భాస్కరభట్లను అభినందించకుండా ఉండలేం.
ప్లస్ పాయింట్స్–
దర్శకుని స్క్రీన్‌ప్లే
కుబేర సినిమాలోని ఎమోషన్స్
నటీనటుల నటన
మైనస్ పాయింట్స్–
స్లో నేరేషన్
20 నిమిషాలు ఎక్స్ట్రా
ఫైనల్ వర్డిక్ట్–
నిజాయితీగా చెప్పిన కథ. నిర్భయంగా సినిమాని ఎంజాయ్ చేయండి.
రేటింగ్– 3.25/5
శివమల్లాల
Also Read This :ఆ కథ నన్ను చాలా వెంటాడింది..