‘నన్ను పెళ్లి చేసుకుంటారా?’ అంటూ నెటిజన్‌కు షాకిచ్చిన మాళవిక

మాళవికా మోహనన్.. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే అభిమానులతో చక్కగా చిట్‌చాట్ నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా రెండు సినిమాల షూటింగ్ పూర్తి చేసిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్‌చాట్ నిర్వహించింది. అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఓపికగా సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే ఒక అభిమాని ఆమె పెళ్లి గురించి ప్రశ్నించాడు. దీనికి మాళవిక ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది. ‘నన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని సదరు అభిమానిని ప్రశ్నించింది. అలాగే తనకు దెయ్యాలంటే భయమని తెలిపింది. దీనికి కారణం.. ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి ఎక్స్ ఖాతా పేరు ‘ఘోస్ట్’ కావడమే.

మాళవిక మోహనన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాజా సాబ్’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ‘రాజా సాబ్’ టీజర్ కు ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. టీజర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న నేపథ్యంలో మాళవిక మోహనన్ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. ‘రాజా సాబ్’ టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్‌తో హ్యాపీగా ఫీలవుతున్నట్లు ఆమె తెలిపింది. ప్రభాస్‌ను ఫస్ట్ టైమ్ సెట్స్‌లో కలిసిన సందర్భాన్ని స్పెషల్ మూమెంట్‌గా తాను ఫీలైనట్లు మాళవిక తెలిపింది. ప్రభాస్ ఎంతో గౌరవంగా, స్నేహంగా ఉంటారని, బాగా మాట్లాడతారని ఆమె పేర్కొంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో విడుదల కానుంది.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *