ప్రస్తుతం హీరో శివకార్తికేయన్ హవా నడుస్తోంది. ఆయన నటించిన ‘అమరన్’ చిత్రం సంచలన విజయం సాధించింది. ఇక ప్రస్తుతం శివకార్తికేయన్, ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ‘మదరాశి’, సుధాకొంగర దర్శకత్వంలో ‘పరాశక్తి’ చిత్రాల్లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ రెండు చిత్రాల్లో పరాశక్తి సెప్టెంబర్‌లో విడుదల కానుందని తెలుస్తోంది. ఇవి రెండు పట్టాలపై ఉండగానే శివ కార్తికేయన్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ గతంలోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయితే లేటెస్ట్ న్యూస్ ఒకటి తెగ ప్రచారం జరుగుతోంది. అదేంటంటే.. శివకార్తికేయన్‌కు జంటగా ఈ చిత్రంలో ఒకరు కాదు.. ఇద్దరు బ్యూటీలు నటించనున్నారట. వారిద్దరూ ఎవరో కాదు.. కల్యాణి ప్రియదర్శన్, కాయాదు లోహర్. కల్యాణి ప్రియదర్శన్ అయితే గతంలోనే శివకార్తికేయన్గా జంటగా నటించింది. ఇక కాయాదు లోహర్ అయితే ఇప్పటి వరకూ ఆయనతో చేసింది లేదు. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్‌తోనే రూపొందించనున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.