డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన ‘డకాయిట్’

అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ ‘డకాయిట్’. షానియల్ డియో దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఫైర్ గ్లింప్స్ ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్‌ విజువల్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా అడివి శేష్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేశాడు. దీనికి సంబధించిన ఫోటోని షోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే టీం జూన్ 8 నుంచి క్రూషియల్ షూటింగ్ షెడ్యూల్ ని ప్రారభించనున్నారు. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. ఈ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *