ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇంట విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఆయన తండ్రి మరణించారు. షైన్ టామ్ చాకో తన తల్లిదండ్రులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా.. సేలం – బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో షైన్ టామ్ చాకో తండ్రి మృతి చెందాడు. షైన్ టామ్ చాకోతో పాటు ఆయన తల్లికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. వీరిని వెంటనే స్థానికి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ‘దసరా’ మూవీతో షైన్ టామ్ చాకో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు.