హీరో శ్రీవిష్ణు చాలా కాలం తర్వాత ‘సింగిల్’ మూవీతో అదిరిపోయే హిట్ అయితే కొట్టాడు. కామెడీ ఎంటర్టైనర్2గా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాకు సమ్మర్ సెలవులు కూడా బాగా కలిసొచ్చాయి. దీంతో బాక్సాఫీస్‌పై కాసుల వర్షం కురిసింది. శ్రీవిష్ణు-వెన్నెల కిషోర్ ట్రాక్ బాగా వర్కౌట్ అవడంతో సింగిల్‌ని ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. ఈ నెల 9న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
సినిమా మంచి సక్సెస్ సాధించినా కూడా నెల రోజుల లోపే ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ‘సింగిల్’ ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం జూన్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందింది. తన మనసుకు నచ్చిన అమ్మాయిని ఎలాగైనా దక్కించుకోవాలని తపించే శ్రీ విష్ణుని మరో అమ్మాయి ఇష్టపడుతుంది. ఈ ముగ్గురి లవ్ స్టోరీ చివరకు ఏమైంది? అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. వెన్నెల కిషోర్ కామెడీ.. సినిమాను ఓ స్థాయికి తీసుకెళ్లింది.