డా. రాజేంద్ర ప్రసాద్, అర్చన కాంబినేషన్లో కొన్నేళ్ల తరువాత వస్తున్న చిత్రం ‘షష్టిపూర్తి’. రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా నటించారు. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ నిర్మించిన ‘షష్టిపూర్తి’ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మీడియాతో ముచ్చటించారు. ‘‘తెలుగులో కరోనా కారణంగా నాకు చాలా గ్యాప్ వచ్చింది. ‘షష్టి పూర్తి’ సినిమాలో జానకి అనే గ్రామీణ అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. హైదరాబాద్‌కు వచ్చి.. కథ విన్న వెంటనే ఒప్పుకున్నాను. ఇప్పుడు ఇలాంటి కథలు అవసరం. టెంపుల్ ట్రెజరర్‌గా.. అచ్చమైన తెలుగమ్మాయిగా ఈ చిత్రంలో కనిపిస్తాను. ఇంతవరకూ ఇలాంటి పాత్రను పోషించలేదు. రాజమండ్రిలో నెల రోజులకు పైగా షూటింగ్ చేశాను. ఆ సమయంలో గోదావరి ప్రాంతాల్ని ఎప్పటికీ మర్చిపోలేను. పడవల్లో ప్రయాణం.. గోదావరి అందాలు ఎప్పటికీ మరచిపోలేను.
‘బెంచ్ లైఫ్’ తరువాత రాజేంద్ర ప్రసాద్ గారితో మళ్లీ ఈ చిత్రంలో నటించాను. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా. మేం ఇద్దరం ఎప్పుడు కలిసి నటించినా గ్లిజరిన్ వాడకుండా సహజంగానే ఎమోషనల్ సీన్స్‌ను రక్తి కట్టించేవాళ్లం. ‘షష్టి పూర్తి’ కోసం పని చేస్తుంటే యాక్టింగ్ స్కూల్‌కు వెళ్లిన ఫీలింగ్. ఈ సినిమా కేవలం ‘షష్టిపూర్తి’ గురించి మాత్రమే కాకుండా అన్ని రకాల అంశాలుంటాయి. కేవలం రెగ్యులర్ హీరోయిన్గా కాకుండా నా పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. నాకు కథ, పాత్ర నచ్చితే ఓటీటీలో అయినా, వెబ్ సిరీస్‌లో అయినా సరే నటిస్తాను. మన పని మనం సక్రమంగా చేసుకుంటూ పోతే అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి. నాకూ అన్ని రకాల జోనర్లనూ టచ్ చేయాలని ఉంది. ‘షష్టిపూర్తి’ మ్యూజిక్, ప్రతీ పాట అందరినీ కదిలిస్తుంది. ఈ మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు నా తండ్రి గుర్తొచ్చారు. నేను ఆయన్ను చాలా మిస్ అయ్యాను’’ అని ఆకాంక్ష సింగ్ చెప్పుకొచ్చింది.
ప్రజావాణి చీదిరాల