అల్లు అర్జున్-అట్లీ కాంబోపై పెరుగుతున్న ఊహాగానాలు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ దీనిని నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా ప్రారంభానికి ముందే ఓ వీడియోను మేకర్స్ విడుదల చేసి సినిమాపై కావల్సినంత హైప్ అయితే క్రియేట్ చేశారు. దీని తర్వాత ఒక్కటంటే ఒక్క అప్‌డేట్ కూడా బయటకు రాలేదు. మేకర్స్ అయితే ఏమీ చెప్పడం లేదు కానీ బయట మాత్రం ఈ సినిమా గురించి కావల్సినన్ని ఊహాగానాలు వినవస్తున్నాయి. సినిమా కథను ఎవరికి తోచిన విధంగా వారు రాసేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఈ చిత్రం గురించి రోజుకో న్యూస్ బయటకు వస్తోంది. వాటిలో నిజమెంతనేది తెలియదు కానీ ప్రచారం అయితే జోరుగానే సాగుతోంది. మొత్తానికి ఈ ప్రచారమంతా సినిమా ప్రమోషన్‌కి బాగానే కలిసొస్తోంది. ఇటీవలి కాలంలో ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యుయెల్ రోల్ చేస్తున్నాడంటూ ప్రచారం జరిగింది. ఇప్పటి వరకూ బన్నీ డ్యుయెల్ రోల్ చేసిన సినిమాలేవీ లేకపోవడంతో సినిమాపై అంచనాలు ఈ న్యూస్‌తో బాగా పెరిగాయి. ఇప్పుడు డ్యుయెల్ రోల్ అని కొందరు.. రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని కొందరు.. మూడో కోణం కూడా ఉందంటూ ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. మొత్తానికి సినిమా అసలు కథ ఏంటో కానీ బయట మాత్రం చాలా కథనాలు వినపడుతున్నాయి. ఈ సినిమాను మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీ సాయంతో విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నట్టు తెలుస్తోంది.

ప్రజావాణి చీదిరాల

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *