పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ‘హరి హర వీరమల్లు’ చిత్రం థియేటర్లలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. పవన్.. డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన మీదట వస్తున్న తొలి చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ అన్నీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా సాగుతున్నాయి. ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ఈ సినిమాలో బాబీ డియోల్.. మొఘల్ చక్రవర్తిగా నటిస్తుండగా.. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
ప్రజావాణి చీదిరాల