నాని-సుజీత్ కాంబో ఫిక్స్.. టైటిల్ ఏంటంటే..

నేచురల్ స్టార్ నాని వరుస సక్సెస్‌లో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టేస్తున్నాడు. ఒకవైపు నిర్మాతగా.. మరోవైపు హీరోగా రాణిస్తున్నాడు. ‘హిట్ 3’ మూవీ తర్వాత వెంటన్ ‘ప్యారడైజ్’ను పట్టాలెక్కించేశాడు. అది షూటింగ్ జరుగుతుండగానే మరో సినిమాను లైన్‌లో పెట్టే పనిలో నాని ఉన్నట్టు సమాచారం. సుజీత్ దర్శకత్వంలో నాని ఓ సినిమాను ఓకే చేశాడట. ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ వర్క్‌ను దసరా తర్వాత ప్రారంభించి.. నవంబర్ 2025 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సుజీత్ సైతం ‘ఓజీ’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు.

ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. సినిమా కోసం నాని, సుజీత్‌లు ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందించాలని తొలుత అనుకున్నా కూడా ఆ తరువాత కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. కానీ నాని పట్టు వదలకుండా ఈ ప్రాజెక్టును ఎలాగైనా పట్టాలెక్కించాలని డిసైడ్ అయ్యాడట. ఈ క్రమంలోనే కొత్త నిర్మాణ సంస్థ సపోర్ట్‌తో పట్టాలెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏది ఏమైనా ఇక మీదట ఏడాది ఒకట్రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడం కన్ఫర్మ్ అని తెలుస్తోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *