‘దేవర’ తర్వాత వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ సెట్స్‌లోకి దూకేశాడు. 2019లో హృతిక్ నటించిన బ్లాక్‌బస్టర్ స్పై థ్రిల్లర్ ‘వార్’కు సీక్వెల్‌గా ‘వార్ 2’ రూపొందుతోంది. వాస్తవానికి ‘దేవర’ తర్వాత ఫలానా మూవీలో ఎన్టీఆర్ చేస్తున్నాడని తప్ప మరో అప్‌డేట్ అయితే రాలేదు. కనీసం ‘వార్ 2’ నుంచి అయినా అప్‌డేట్ వస్తుందేమోనని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్కటి కూడా అప్‌డేట్ రాలేదు. తాజాగా హృతిక్ రోషన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌తో ఎన్టీఆర్ పుట్టిన రోజు అయిన మే 20 సందర్భంగా అద్భుతమైన అప్‌డేట్ రానుందని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇంతకీ హృతిక్ పెట్టిన పోస్ట్ ఏంటంటే.. ‘‘హే తారక్.. ఈ ఏడాది మే 20న ఏం జరుగనుందో ఊహించగలవా? నన్ను నమ్ము.. నీకోసం ఏం సర్‌ప్రైజ్ ఉందనేది నువ్వు ఊహించలేవు. సిద్ధంగా ఉండు’’ అంటూ హృతిక్ పోస్ట్ పెట్టాడు.
మొత్తానికి ‘వార్ 2’ నుంచి సాలిడ్ అప్‌డేట్ అయితే రానుంది. టీజర్ వదలొచ్చని ఇప్పటికే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఈ సినిమా నుంచి మాత్రమే కాకుండా ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం నుంచి కూడా అప్‌డేట్ రావొచ్చని అంతా భావిస్తున్నారు. ఈ సినిమాకు ప్రస్తుతం ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్ ఉంది. అయితే మే 20న టైటిల్ లేదంటే పోస్టర్ అదీ కాదంటే రెండూ కలిసి వెలువడొచ్చని ఊహాగానాలు వినవస్తున్నాయి. చాలా కాలంగా ఎన్టీఆర్ అప్‌డేట్స్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు ఒక్కసారిగా రెండు అప్‌డేట్స్ వస్తే పండుగే. ఇక ‘వార్ 2’ ఎన్టీఆర్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించవచ్చంటూ ఊహాగానాలు వినవస్తున్నాయి. హృతిక్ ఎన్టీఆర్ మధ్య యాక్షన్ సన్నివేశాలు అత్యంత పవర్‌ఫుల్‌గా ఉంటాయని సమాచారం. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 14న విడుదల కానుంది.
ప్రజావాణి చీదిరాల