ఇంట్రోవర్ట్ లు ఆర్టిస్ట్‌లు అవ్వొచ్చా….

టాలెంట్, అదృష్టంతో పాటు ఓపిక ఉంటే ఏ రంగంలో అయినా రాణించొచ్చు అనటానికి సరైన ఉదాహరణ ఈ నటుడు. ఇంట్రోవర్ట్ అసలు ఈ ఇండస్ట్రీలోకి వచ్చి బతకలేరు అనే చాలామందికి సమాధానామే ఈ ఇంట్రావర్టు కథ. చిన్నబడ్జెట్‌ సినిమాల్లో హీరోగా నటిస్తూనే పెద్ద హీరోలు నటించే సినిమాల్లో కొంచెం ఇంపార్టెన్స్‌ ఉన్న పాత్రల్లో నటించాల్సి వచ్చినప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా తనను తాను తగ్గించుకోవటం, పెంచుకోవటం అనే కాన్సెప్ట్‌ను పక్కనపెట్టి రెగ్యులర్‌గా సినిమాలు చేస్తున్న ఈ నటుని పేరు సూర్య శ్రీనివాస్‌. పవన్‌కల్యాణ్, సాయి దుర్గాతేజ్‌ హీరోలుగా నటించిన ‘బ్రో’లో సాయి తమ్మునిగా, నాని హీరోగా విడుదలైన హిట్‌–3లో పోలీసాఫీసర్‌ పాత్రలో నటించి మంచి మార్కులు వేయించుకున్నాడు హీరో కమ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌. దేశంలోని అనేక భాషల్లో 60కి పైగా యాడ్స్‌లో నటించారు శ్రీనివాస్‌.

తాను హీరోగా నటించిన అనేక సినిమాలు త్వరలోనే ప్రేక్షకులముందుకు రానున్నాయని ఎంతో ఆనందంతో తన కథంతా పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చాడు. పేషెన్స్‌తో నేను ఏదైనా సాధిస్తాను అంటూ ఎంతో గొప్పగా మాట్లాడిన శ్రీనివాస్‌ పాడ్‌కాస్ట్‌ ట్యాగ్‌తెలుగు యూట్యూబ్‌లో స్ట్రీమ్‌ అవుతుంది. పవన్‌ కల్యాణ్‌తో తన పరిచయం, నానితో అనుబంధం గురించి ఎంతో గొప్పగా షేర్‌ చేసుకున్నారు సూర్య శ్రీనివాస్‌. అన్నట్లు తన పేరు శ్రీనివాస్‌ మాత్రమే. సూర్య అనేది ఎందుకు యాడ్‌ అయిందో అనే కథ ఇంటర్వూ చూస్తే మీకే అర్థం అవుతుంది. ఇంటర్వూ బై శివమల్లాల

Also Read This : ‘ప్రొడక్షన్ నం 1’ షూటింగ్ పూర్తి చేసిన సోనుధి ఫిలిం ఫ్యాక్టరీ

Actor Surya Srinivas
Actor Surya Srinivas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *