‘హరి హర వీరమల్లు’ సినిమా గుమ్మడికాయ కొట్టేందుకు సిద్ధమవుతోంది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ షూటింగ్ సెట్లో ఆదివారం అడుగు పెట్టారు. దీంతో మేకర్స్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు. దీనిపై మేకర్స్ పవన్ ఫ్యాన్స్ కోసం మంచి అప్డేట్ అయితే ఇచ్చారు. ఇకపై ‘‘పవన్ కల్యాణ్ గారు చివరి రెండు రోజుల ‘హరిహర వీరమల్లు’ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ అద్భుతమైన షూటింగ్‌కు సంబంధించిన ప్రయాణం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఎక్స్‌ప్లోజివ్ ట్రైలర్, ఎలక్ట్రిఫైయింగ్ సాంగ్స్ కమింగ్ సూన్’ అని మూవీ టీం ట్విటర్ వేదికగా వెల్లడించింది.
ఇంకేముంది.. పవన్ ఫ్యాన్స్‌కు భూమిపై కాలు నిలవడం లేదు. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన సినిమాల నుంచి దాదాపుగా ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇప్పుడు రానుందని తెలియడంతో పట్టలేనంత సంతోషంలో ఉన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే సినిమా విడుదలైతే ఎలా ఉంటారో చూడాలి. ఇక ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించనున్నారు. మొదటి భాగం ‘హరి హర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.