...

Heroine Ivana: శ్రీవిష్ణు కూల్.. సైలెంట్.. కాస్త ఇంట్రావర్ట్

శ్రీ విష్ణు, ఇవానా జంటగా రూపొందిన చిత్రం ‘సింగిల్‌’. ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 9న థియేటర్లలోకి రానుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల జోష్‌ను పెంచేసింది. ఈ సందర్భంగా హీరోయిన్ ఇవానా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకుకుంది.

‘‘డైరెక్టర్ కార్తీక్ గారు ఒకరోజు కాల్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. కథ విన్నాక చాలా నచ్చింది. దీంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు ఇదే సరైన సినిమా అనిపించింది. ఈ సినిమాలో హరిణి అనే పాత్రలో చాలా జోవియల్ అండ్ ప్లెజెంట్‌గా కనిపిస్తా. హరిణి కేరెక్టర్‌లో చాలా ఎమోషన్, ఫ్యామిలీ అటాచ్‌మెంట్ ఉంటుంది. సినిమా కోసం నా కో యాక్టర్స్ సాయంతో తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నించా. ఇది లాఫ్ రైడ్‌లా ఉండే చాలా ఫన్ మూవీ.
ఇదొక అందరికీ కనెక్ట్ అయ్యే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. నన్ను ప్రెస్‌మీట్‌లో అంతా ‘లవ్ టుడే’ చిత్రంలోని ‘బుజ్జి కన్నా’ అనే పాత్ర పేరుతో పిలవడం చాలా ఆనందాన్నిచ్చింది. ఒక క్యారెక్టర్ పేరుని గుర్తు పెట్టుకోవడానికి మించిన ఆనందం నటికి ఏముంటుంది? అలా పిలిచిన ప్రతిసారి నేను చాలా ఎంజాయ్ చేస్తాను.

ఇక శ్రీ విష్ణు గారు చాలా కూల్ అండ్ సైలెంట్, కాస్త ఇంట్రో వర్ట్ అనిపిస్తారు. కానీ కిషోర్ గారితో కలిసినప్పుడు మాత్రం చాలా హిలేరియస్‌గా ఉంటారు. దర్శకుడు కార్తీక్ గారు తమిళియన్ కాబట్టి ఆయనతో నేను ఆ భాషలోనే మాట్లాడేదాన్ని. ఆయన చాలా క్లియర్ విజన్ ఉన్న డైరెక్టర్. సినిమాలో నాది ఒక డ్యాన్సర్ పాత్ర అని తెలియడంతో మరోసారి డ్యాన్స్ క్లాసెస్‌కి వెళ్లి అక్కడ భరతనాట్యం నేర్చుకున్నా. ఇప్పటి వరకూ నేను చెల్లి, ప్రియురాలు వంటి పాత్రలు చేశాను. అయితే నాకు రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉండే పాత్రలు చేయాలని ఉంది. ప్రస్తుతం నేను మాస్టర్స్ చేస్తున్నా కాబట్టి ముందుగా దానిని పూర్తి చేయాలనుకుంటున్నా’’ అంటూ ఇవానా చెప్పుకొచ్చింది.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.