ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన స్టార్ హీరో సినిమా

స్టార్ హీరో అజిత్ నటించిన తాజా యాక్షన్‌ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా విడుదలై ఎన్నో రోజులు కావడం లేదు. అయినా కూడా సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మే 8 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ త్రిష.. అజిత్‌ సరసన నటించింది. ఈ సినిమాలో ఏకే అలియాస్‌ రెడ్‌ డ్రాగన్‌‌గా అజిత్ నటించారు. ప్రపంచంలోనే పేరు మోసిన గ్యాంగ్‌స్టర్‌గానూ.. ఎన్నో ఏళ్లు చక్రవర్తిలా చీకటి సామ్రాజ్యాన్ని ఏలిన వ్యక్తిగా మెప్పించారు

అంతటి గ్యాంగ్‌స్టర్.. భార్య రమ్య (త్రిష)కి ఇచ్చిన మాట కోసం తన నేర సామ్రాజ్యాన్ని వదిలేసి జైలుకు వెళ్తాడు. 17 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన అనంతరం బయటకు రాగానే తన కొడుకు విహాన్‌ (కార్తీక్‌ దేవ్‌)ను చూసేందుకు భార్యతో కలిసి స్పెయిన్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతాడు. ఆ తరువాత కథ ఏం జరుగుతుంది? కొడుకును అజిత్ కలిశారా? అనే ఆసక్తికర అంశాలతో సినిమా రూపొందింది. ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదలైంది. కనీసం నెల కూడా గడవకముందే ఓటీటీ విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుందో చూడాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *