SS Rajamouli : రాజమౌళి క్లారిటీ ఇచ్చేశారు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..

SS Rajamouli :

ఫ్రాంఛైజీలను సృష్టించడం ఒక ఎత్తైతే.. వాటిని సక్సెస్ చేయడం మరో ఎత్తు. అన్ని ఫ్రాంచైజీలు సక్సెస్ బాట పట్టవు. దీంతో అవి ముందుకు వెళ్లడం కష్టమే. ‘హిట్’, ‘హిట్ 2’ సక్సెస్ బాట పట్టగానే ‘హిట్ 3’ని మేకర్స్ ప్రకటించేశారు. ఇది ఫ్రాంఛైజీ బాట పట్టిందని అందరికీ అర్థమైపోయి ఈ చిత్రం విడుదలకు ముందే ‘హిట్ 4’లో ఎవరు నటిస్తారనే విషయమై ఊహాగానాలు చేస్తున్నారు. మే 1న పెద్ద సినిమాలు మూడు రానున్నాయి. సూర్య ‘రెట్రో’.. అక్షయ్ కుమార్ ‘రైడ్ 2’ చిత్రాలు రానున్నా కూడా ‘హిట్ 3 ’తర్వాతే ఆ రెండు ఉంటాయని నాని ఫ్యాన్స్ చెబుతున్నారు. నాని ప్రధాన పాత్రలో నటించిన ‘హిట్ 3’ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో రెండు విషయాలపై క్లారిటీ వచ్చింది.

ఒకటేంటంటే.. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’. తాజాగా దీనిని రాజమౌళి రూపొందిస్తారా? అనే దానికి క్లారిటీ వచ్చింది. అసలు అనుమానాలు తలెత్తడానికి కారణం ఇటీవల అమీర్ ఖాన్ చేసిన ప్రకటనే. ఆయన కూడా భారీ ప్రాజెక్టుగా ‘మహాభారతం’ను రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడమే. ఈ ప్రాజెక్టును సిరీస్‌లుగా రూపొందిస్తానని.. భారీ ప్రాజెక్టుగా నేటి తరానికి దీనిని అందిస్తానని అమీర్ ఖాన్ తెలిపారు. ఈ విషయమై ఆయన క్లారిటీ ఇవ్వడంతో రాజమౌళి ‘మహాభారతం’పై నీలినీడలు కమ్ముకున్నాయి. ‘హిట్ 3’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళిని సుమ ‘మహాభారతం’ మూవీ విషయమై ప్రశ్నించారు. ఈ మూవీలో నాని నటిస్తారా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానంగా తప్పక ఉంటారని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. దీంతో ‘మహాభారతం’ ప్రాజెక్టును రాజమౌళి తీస్తారా? లేదా? అన్న ప్రశ్నకు కూడా క్లారిటీ వచ్చినట్టు అయ్యింది. మొత్తానికి ఈ క్లారిటీతో ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజావాణి చీదిరాల

Also Read This : నా సినిమా నుంచి లీక్స్ వస్తే చాలా కోపం వస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *