హైమత్ షాకింగ్ స్టోరీ.. ఏమాత్రం సంగీత జ్క్షానం లేని వ్యక్తి ప్రస్థానం వెండితెరకు ఎలా సాగిందంటే..

సంగీత కళాకారునిగా నువ్వు గుర్తుంపు తెచ్చుకున్నావంటేనే దేవుడు నిన్ను మంచిగా చూసినట్లని సింగర్ ప్రవస్థి ఆరాధ్యను ఉద్దేశించి సింగర్ హైమత్ మహమ్మద్ పేర్కొన్నాడు. ‘ట్యాగ్ తెలుగు’ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడిన విషయాలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఏమాత్రం సంగీతమంటే తెలియని వ్యక్తి సింగర్‌గా నిలదొక్కుకున్న తీరు స్ఫూర్తినిస్తుంది. సింగర్ ప్రవస్థికి సలహాలిస్తూనే తన గురించి చెప్పుకున్న తీరు ఆకట్టుకుంటుంది.

అసలు హైమర్ మహమ్మద్ ఏం మాట్లాడాడో అతని మాటల్లోనే.. ‘‘దేవుడు నీవైపు ఉన్నాడు. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప అలాంటి అదృష్టం అందరికీ దక్కదు. ఏ సంగీతం తెలియని నాకు 22 ఏళ్ల వయస్సులో యంబీఏ చదువుకునే సమయంలో నా స్నేహితుడు ‘నీ గొంతు బావుంటుంది సినిమా పాటలు పాడు’ అంటే అదేంటో తెలియకుండానే సారథి స్టూడియోస్‌ గడప తొక్కాను. ఆ రోజు ‘నీ గొంతు బావుంది కానీ, నీకు సంగీతం మీద కొంచెం కూడా అవగాహన లేదు’ అని నన్ను ఆ పాటల పోటీ రియాలిటీ షోకి సెలక్ట్‌ చేయలేదు సింగర్‌ పార్థసారధి (పార్థు) గారు. సర్‌ దగ్గరికెళ్లి నిజంగానే సంగీతం నాకు తెలియదు మీరే నాకు నేర్పించండి అంటూ దాదాపు రెండు నెలలు వెంటపడితే పార్థుగారు చిన్న అవకాశం ఇచ్చారు. ఆరోజుతో నా జీవితం మారిపోయింది.

పెట్టే బేడా సర్దుకుని ఆయన స్టూడియోలోకి మకాం మార్చుకున్నాను. కరీంనగర్‌ జిల్లాలోని చిన్న పల్లెటూరు నుండి హైదరాబాద్‌ చదువుకోవటానికి వచ్చిన నన్నే కళామతల్లి ఆదరించింది. సింగర్‌గా 500 పైగానే పాటలు పాడే అవకాశం అందించింది. తెలుగు సినిమా పరిశ్రమలోని అందరు సంగీత దర్శకుల దగ్గర పనిచేసే అవకాశం దక్కింది. అటువంటిది చిన్నప్పటి నుంచి సంగీతంలోనే పుట్టి పెరిగిన నీవు ఒక చిన్న ఎలిమినేషన్‌తో ఇంత గొడవ ఎందుకు చేస్తున్నావు చెల్లి..? మళ్లీ నీవు సింగర్‌గా ఎంతో రాణించాలి. మంచి మంచి వేదికలపై నీ గొంతు వినిపించాలి చెల్లెమ్మా’’ అంటూ గాయకుడు హైమత్‌ మహమ్మద్‌ ప్రవస్థి మాట్లాడుతున్న మాటల గురించి తనదైన శైలిలో ఆ అమ్మాయిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. అలాగే సంగీత దర్శకుడు కీరవాణి గురించి, సింగర్‌ సునీత , పాటల రచయిత చంద్రబోస్‌ గురించి వారితో తనకున్న అనుభవాలను మాటల రూపంలో తెలియచేస్తూ అక్కడక్కడ తన పాటలను పాడారు హైమత్‌. ట్యాగ్‌తెలుగు యూట్యూబ్‌ ఛానల్‌కి ఇచ్చిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తను పాటగాడిగా ఉండటం ఎంత అదృష్టమో చాలా గొప్పగా మాట్లాడాడు. మిస్సవ్వకుంగా ఈ ఇంటర్వూ చూసే ప్రయత్నం చేయండి….. ఇంటర్వూ బై శివమల్లాల

Also Read This : సారంగపాణి జాతకం రివ్యూ..

Singer Hymath Mohammed
Singer Hymath Mohammed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *