నేచురల్ స్టార్ నాని, శైలేష్ కొలను కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘హిట్ 3 (HIT: The 3rd Case). ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ లీడ్ పెయిర్ రొమాంటిక్ సాంగ్‌తో ప్రారంభమయ్యాయి. ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ ‘అబ్కీ బార్.. అర్జున్ సర్కార్’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. అర్జున్ సర్కార్ వ్యక్తిత్వాన్ని హైలైట్ చేసేలా ఈ పాట ఉంటుంది. ఈ పాట అర్జున్ సర్కార్ తప్పు చేసిన వారి విషయంలో ఎంత కఠినంగా ఉంటాడో చెబుతుంది. అనురాగ్ కులకర్ణి డైనమిక్ వాయిస్ సాంగ్ ని మరో లెవల్‌కి తీసుకెళ్లింది. ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఈ పాటతో వెల్లడించారు.
ప్రజావాణి చీదిరాల
Also Read This : ‘కన్నప్ప’ రిలీజ్ డేట్ ఫిక్స్..
