Arjun S/O Vyjayanthi: కీలక అప్‌డేట్ వచ్చేసింది..

Arjun S/O Vyjayanthi :

నందమూరి కల్యాణ్ రామ్, విజయశాంతి తల్లీకొడుకులుగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. చాలా కాలం తర్వాత విజయశాంతి పవర్‌ఫుల్ పాత్రలో నటించారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయశాంతి, కల్యాణ్ రామ్ పాత్రల మధ్య డైనమిక్స్ కీలకంగా ఉండబోతున్నాయి. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు.

‘అర్జున్ S/O వైజయంతి’ మూవీ నుంచి టీజర్, ఒక సాంగ్ విడుదలైంది. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ సింగిల్‌కి సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. ‘ముచ్చటగా బంధాలే’ సాంగ్ ఈ నెల 9న విడుదల కానుంది. చిత్తూరు శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో ఈ పాటను విడుదల చేయనున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో జోష్ పెంచారు. సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.

ప్రజావాణి చీదిరాల

Also Read This : స్కూల్లో అగ్ని ప్రమాదం.. పవన్ చిన్న కుమారుడికి తీవ్ర గాయాలు

Ravi Antony Exclusive Interview
Ravi Antony Exclusive Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *