Good Bad Ugly :
అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ హై-ప్రొఫైల్ మూవీ ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో సంచలనం సృష్టించింది. తాజాగా మేకర్స్ తెలుగు ట్రైలర్‌ని విడుదల చేశారు. ఇక ట్రైలర్ గురించి చెప్పాలంటే హీరో అజిత్ వన్ మ్యాన్ షోలా అనిపిస్తోంది. గతంలో మునుపెన్నడూ కనిపించని రీతిలో కనిపిస్తున్నారు. సోనూసూద్‌కి అయితే ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ దొరికింది. కొడుకును కాపాడుకునేందుకు తిరిగి తన వైలెంట్ ఫాస్ట్‌కి అజిత్ రావడం.. ఆయన క్యారెక్టరైజేషన్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. ట్రైలర్‌లో త్రిష కృష్ణన్, అర్జున్ దాస్, ప్రభు, ప్రసన్న, సునీల్ కీలక పాత్రల్లో కనిపించారు. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Also Read This : రెడ్ పప్పెట్ ఫస్ట్ వెంచర్‌కు టైటిల్ ఫిక్స్
