సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పరమ నాస్తికుడిని అంటూ చెప్పుకుంటూ తిరిగే ఆర్జీవీ శ్రీరామనవమి నాడు గుడిలో ప్రత్యక్షమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ‘రామ్ గోపాల్‌వర్మ ఏమీ తక్కువోడేం కాదు.. పైకి అపర నాస్తికుడినంటూ కబుర్లు.. లోలోపల పరమ భక్తుడు..’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. వర్మ చెప్పేదొకటి.. చేసొదొకటని రచ్చ చేస్తున్నారు. నాస్తికుడినని చెప్పుకుంటూ శ్రీరామనవమినాడు గుడిలో ప్రత్యక్షమవడమేంటని మరికొందరు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ ఉన్న ఫళంగా ఓవర్ నైట్‌లో పరమ భక్తుడు అయిపోలేదు. తన తదుపరి సినిమా లొకేషన్ కోసం గుడిని పరిశీలించారంతే.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇంకేముంది? ఆర్జీవీ నాస్తికత్వాన్ని వీడి ఆస్తికుల్లో కలిసిపోయారంటూ నెటిజన్లు రచ్చ చేస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల