డియర్‌ నిర్మాతల్లారా….వెల్‌కమ్‌ టు ద ఇండస్ట్రీ

మనం సినిమా తీసేద్దాం…ఇన్ని కోట్లు ఖర్చు..థియేటర్‌ నుండి కొన్ని కోట్లు వస్తాయి. శాటిలైట్‌ నుండి మరో కొన్ని కోట్లు వస్తాయి.

ఓటిటిలో డిజిటల్‌ రైట్స్‌ అమ్మితే మిగిలిన కోట్లు వచ్చేస్తాయి. ఇంతటితో సినిమాకి పెట్టిన ఖర్చులు వచ్చేస్తాయి.

ఇప్పటినుండి వచ్చే డబ్బంతా మనకు లాభం.

అవేంటో చెప్తాను వినండి నిర్మాతగారు అంటూ ఓ కొత్త నిర్మాతను పట్టే ప్రాసెస్లో ఉన్న దర్శకుడు చెప్పే మిగతా వివరాలు చూద్దామా.

ఇవికాకుండా మ్యూజిక్‌ సంస్థలిచ్చే ఆడియో రైట్స్, హిందీ డబ్బింగ్‌ రైట్స్, ఓవర్సీస్‌ రైట్స్, రెస్టాఫ్‌ ఇండియా రైట్స్, సౌత్‌ ఇండియా డబ్బింగ్‌ రైట్స్‌ అంతేనా ఇంకా ఉన్నాయి.

మన సినిమా సూపర్‌డూపర్‌ హిట్టయిన తర్వాత వచ్చే రీమేక్‌ రైట్స్‌. ఇవన్నీ మనం సినిమా చేసిన తర్వాత వచ్చే లాభాలే.

ప్రొడ్యూసర్‌ గారు రీమేక్‌రైట్స్‌లో మాత్రం ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ క్రింద నా వాటా 25 శాతం షేర్‌ ఉంటుంది. ముందే చెప్తున్నాను.

ఇంక నా రెయ్యునరేషన్‌ సంగతి అంటారా? మనమంతా ఒకే ఫ్యామిలీలాంటి వాళ్లం.

ఒక ఐదులక్షలు అటుఇటుగా మీరే చూసి ఇచ్చేయండి.

మనలో మనకు డబ్బులు టాపిక్‌ పెద్దగా ఏముంటుంది.

ఆఫీస్‌ మాత్రం మంచి ఏరియాలో తీస్తే మనకు, మన సినిమాకు, మీకు, విలువ పెరుగుతుంది అంటాడు గొప్ప దర్శకుడు అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్న మన దర్శకుడు.

ఎవరైనా కొత్త నిర్మాత సినిమా తీద్దాం అనుకుంటే సినిమా పరిశ్రమలోకి ఎలాగైనా అడుగు పెట్టాలి అని బలంగా అనుకుంటే వారికి కొత్తగా ఎదురయ్యే అనుభూతులివి.

వీరిలో నూటికి పదిమంది సినిమా అవకాశాలు పొందొచ్చు. వారిలో ఒకరో ఇద్దరో సక్సెస్‌ కూడా కావొచ్చు. అది తర్వాత సంగతి.

అయితే ఇక్కడ ఒక విషయం ఖచ్చితంగా మాట్లాడాలి. కొత్త నిర్మాతలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు.

గతంలో ఈ దర్శకులు చెప్పినట్లు ఎంతమంది నిర్మాతలకు మంచి జరిగింది.

ఎంతమంది ఈ రిజల్ట్‌ను అనుభవించారు అనే విషయాన్ని ఖచ్చితంగా గత చిత్ర నిర్మాతలతో మాట్లాడి సినిమా చేస్తే తప్పేంలేదు.

అలా కాకుండా మరోలాకూడా నిర్మాతలుగా మారొచ్చు.

చిత్ర పరిశ్రమలో కొన్నేళ్లు పనిచేసిన తర్వాత ఖచ్చితంగా ఒక అవగాహన వస్తుంది.

కొంతకాలం పనిచేశాక 24 శాఖల్లో ఏ శాఖనుండైనా ఎంతోకొంత అవగాహన వస్తుంది.

అప్పుడు నిర్భంతరంగా ఏ కొత్త నిర్మాతైనా సినిమా చేయొచ్చు.

లేదంటే మీకు దెబ్బలు పడతయ్‌ రాజా…దెబదెబదెబ్బల్‌ పడతయ్‌రో అంటూ పాట పాడుకుంటూ ఏ ఊరు నుండి వచ్చారో ఆ ఊరుకి తిరుగు ప్రయాణం అవ్వాల్సిందే…

అందుకే జాగ్రత్తగా సినిమాలు తీయండి. పదికాలాలపాటు పదిమందికి అన్నం పెట్టినవారవుతారు.

మీ పేరు పదికాలాల పాటు చిరస్థాయిగా మిగిలిపోతుంది మై డియర్‌ నూతన నిర్మాతల్లారా…

శివమల్లాల

Also Read This : పాట ,మాట, మనిషి కూడా శ్రావ్యంగా ఉండాలి

Lyric Writer Purna Chary Exclusive Interview
Lyric Writer Purna Chary Exclusive Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *