KEEDAA COLA Review:తరుణ్ భాస్కర్ “కీడా కోలా” సినిమా రివ్యూ.!
సినిమా – కీడా కోలా
నటీనటులు: బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు, రాగ్ మయూర్, రఘురామ్, రవీంద్ర విజయ్, జీవన్‌కుమార్, విష్ణు, హరికాంత్ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: ఏజే ఆరోన్
ఎడిటర్: ఉపేంద్ర వర్మ
నిర్మాతలు: కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్
దర్శకుడు : తరుణ్ భాస్కర్
విడుదల తేదీ : నవంబర్ 03, 2023
రేటింగ్ : 2.75/5
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలతో టాలెంటెడ్ దర్శకుడు గా నిరూపించుకున్న తరుణ్ భాస్కర్ దాస్యం.
ప్రస్తుతం తాను డైరెక్ట్ చేసిన సినిమా కీడా కోలా ఈరోజు రిలీజ్ అయింది. ఇప్పుడు ఆ సినిమా కథ ఏంటో, ఎలా ఉందొ చూద్దాం.
కథ : కథలోకి వెళ్తే, తన మనవడు వాసుతో జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు వరదరాజు. కాగా వాసు కి ఉన్న కొన్ని వ్యక్తిగత కారణాల వలన తన లైఫ్
ఏమి అర్ధంకాకుండా ఉంటుంది. అలాంటి టైం లో వాసు తన ఫ్రెండ్ కౌశిక్ ఇచ్చిన కీడా కోలా బాటిల్ ఎలా అయినా కోట్లల్లో డబ్బు సంపాదించాలి
అని అనుకుంటారు. ఇంతకీ ఆ ఐడియా ఏంటి? ఆ ఐడియా వాసు జీవితాన్ని ఎలా మార్చింది అనేది మిగతా కథ. ఇంకో క్యారక్టర్ నాయుడు 20 ఏళ్ళు
జైలు లో గడిపి వస్తాడు. తన తమ్ముడు జీవన్ కోసం తను ఒక ప్లాన్ వేస్తాడు. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి? ఆ ప్లాన్ కి వాసు కథ కు సంబంధం ఏంటి అనేది
ఇంకో కథ.
సినిమా అంతా కీడా కోలా అనే బాటిల్ చుట్టూ తిరుగుతూ
మొత్తం కథ ఇక్కడే తెలుసుకుంటే సినిమా చూస్తున్నప్పుడు ఇంట్రెస్టింగ్ పోతుంది. సినిమా చూస్తున్నప్పుడు మీకే తెలుస్తుంది.
ఇదొక థ్రిల్లర్ బ్యాక్డ్రాప్ లో సాగే కామెడీ జోనర్ సబ్జెక్టు. సినిమా అంతా కీడా కోలా అనే బాటిల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. డార్క్ బేసెడ్ కామెడీ
సినిమాలు మనం ఇదివరకూ కూడా చాలానే చూసాము. అలాంటి సినిమాల్లో ఇది ఒకటి. నాయుడు క్యారక్టర్ బాగుంటుంది. సినిమాలో కామెడీ ని
హైలెట్ చేసారు. ఇంటర్వెల్ బాగుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. చైతన్య రావు నటన బాగుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే
కామెడీ సన్నివేశాలు బాగా అలరిస్తాయి. దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా ఇందులో ఒక పాత్ర చేసాడు. తన నటన బాగుంది. ఈ సినిమాకు ప్లస్
పాయింట్ అంటే వివేక్ సాగర్ సంగీతం అని చెప్పొచ్చు.
కథ పర్లేదు అనిపించినప్పటికీ కథనం మాత్రం బోర్ కొట్టిస్తూ ఉంటుంది. డ్రామా ఎక్కువ అవ్వడం కూడా ఈ సినిమాకు మైనస్. ఇలాంటి కామెడీ
సినిమాలు మనం ఇంతకముందు చూసాము కాబట్టి అంత ఇంట్రెస్టింగ్ గా ఏమి అనిపిచ్చదు. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇంకా స్క్రిప్ట్ మీద
కూర్చొని ఉంటే బాగుండు అనిపిచ్చింది.
టెక్నీకల్ గా చూస్తే, కెమెరా మ్యాన్ వర్క్ సినిమాను చూస్తున్నంతసేపు మనల్ని కట్టిపడేస్తుంది. ఆ తరువాత చెప్పుకోవాల్సింది వివేక్ సాగర్
సంగీతం గురించి. సినిమాను చాలా వరకూ బ్రతికిచ్చింది వివేక్ ఏ. ఎడిటర్ ఇంకా కొంచెం షార్ప్ చేసి ఉంటే బాగుండేది. చాలా చోట్ల బోర్ అనే ఫీల్
లేకుండా ఉండేది. ప్రొడక్షన్ విలువలు బాగున్నాయి. కథకు తగ్గట్టు ఖర్చు పెట్టారు. తరుణ్ భాస్కర్ స్క్రిప్ట్ మీద ఇంకా వర్క్ చేసి ఉంటే సినిమా
ఇంకా బాగుండేది.
ఈ సినిమా కామెడీ జోనర్ మూవీస్ ఇష్టపడేవాళ్ళకు నచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే మల్టిప్లెక్స్ అభిమానులకు కూడా ఒకే అనిపిస్తుంది.
తరుణ్ భాస్కర్ గత సినిమాలను దృష్టిలో పెట్టుకొని వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిస్పాయింట్ అవుతారు. ఎటువంటి అంచనాలు లేకుండా వెళ్తే
సరదాగా వెళ్ళిపోయింది అనేటువంటి సినిమా.
ఒక్క మాటలో – ఎదో అలా అలా.!
Also Read:IPS Kothakota Srinivasa Reddy:ఎంతోమంది వస్తారు.. కానీ ఈయన?