ఆత్మహత్య చేసుకున్న కబాలి నిర్మాత….

రజినీకాంత్ ‘కబాలి’ సినిమా తెలుగు నిర్మాత కేపీ చౌదరి (కృష్ణ ప్రసాద్ చౌదరి) ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు.

డ్రగ్స్ వ్యవహారంలో పీకల్లోతులో మునిగి విమర్శల పాలైన ఆయన గోవాలో సూసైడ్ చేసుకున్నాడు.

అయితే ఆయన తీవ్ర అనారోగ్య కారణాలు, ఆర్థిక ఇబ్బందులతో సూసైడ్‌కు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కేపీ చౌదరి 2016లో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. రజినీకాంత్ ‘కబాలి’ సినిమా తెలుగు వెర్షన్‌కు నిర్మాతగా వ్యవహరించాడు.

ఇక నిర్మాతగానే కాకుండా అనేక తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా చేశాడు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సర్దార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం వంటి సినిమాలను కేపీ చౌదరి డిస్ట్రిబ్యూట్ చేశాడు.

అయితే అతడికి సినీ ఇండస్ట్రీ అంతగా కలిసి రాలేదనే చెప్పాలి.

దీంతో అతడు డ్రగ్స్ దందాలోకి దిగాడు. ఈ క్రమంలోనే గోవాలో ఓహెచ్ఎం పబ్‌ను ప్రారంభించాడు.

అక్కడ పలు సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేసేవాడు. ఇక అందులో కూడా నష్టాలు రావడంతో తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశాడు.

ఇక్కడ గతంలో అతడిపై డ్రగ్స్ కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో నార్సింగి పోలీసులు అతడిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ కూడా చేశారు.

అతడు వరలక్ష్మి టిఫిన్ డ్రగ్స్ కేసులో నిందితుడుగా ఉన్నాడు. అంతేకాకుండా అతడు ఎంతో మంది సినీ సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

ఇలా పలు కేసుల్లో కేపీ చౌదరి తీవ్ర విమర్శలతో కుంగిపోవడమే కాకుండా…అప్పులపాలు అవ్వడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

సంజు పిల్లలమర్రి

Also Read This : మంచు విష్ణు కొడితే కుంభస్థలం కొట్టాలి అనుకున్నాడేమో ..అందుకే ప్రభాస్‌తో..

Prabhas as Rudra
Prabhas as Rudra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *