ఆదికి అరుదైన అవకాశం ఈ ఫోటో…
కొన్ని ఫోటోలు చూడగానే ఒక్క నిమిషం అలా ఆగి కాసేపు చూసి మనలో మనమే నవ్వుకుంటాం.
ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుని ఈ ఫోటో భలే తీపి గుర్తు కదా అనుకుంటాం.
అలాంటి ఒక ఫోటోనే ఇప్పుడు మీరు చూస్తున్నది. చాలామందికి తమ చిన్నప్పుడు సెలబ్రిటీలతో దిగిన ఫోటోలు ఉంటాయి.
తర్వాత కాలంలో హీరో అవుతాడని ఆ ఫోటోలో ఉన్న కుర్రాడికి అస్సలు ఊహలో కూడా లేని సందర్భమది.
మెగాస్టార్ చిరంజీవితో ఈ రేంజ్ ఫోటో ఉండటం ఎంతో అరుదు. అలాంటి అరుదైన ఫోటో హీరో ఆది సాయికుమార్‌కి దక్కింది.
తన తండ్రి సాయికుమార్ నటుడవ్వటంతో ఇలాంటి రేర్ ఫోటోను ఆది దక్కించుకున్నారు.
ఆ రోజుల్లో ఒక సినిమా విజయం సాధిస్తే 50 రోజుల వేడుక, 100 రోజుల వేడుకలు ఎంతో గొప్పగా చేసేవారు సదరు నిర్మాత, దర్శకులు.
24 శాఖల్లోని ఎవరింటికి వెళ్లినా అనేక షీల్డ్స్, మెమొంటోలు దర్శనమిస్తాయి.
ప్రస్తుతం అలాంటివి జరిగేవట అని చెప్పుకోవటమే తప్ప పొరపాటున కూడా అలాంటి సందర్భాలు రావటం లేదు.
వచ్చినాకూడా వాటికి పెద్దగా విలువ లేకుండా పోయాయి.
ఈ ఫోటో విషయానికి వస్తే ముత్యాలసుబ్బయ్య గారి దర్శకత్వంలో జయసుధ, చంద్రమోహన్,
సాయికుమార్ లీడ్‌రోల్స్‌లో నటించిగా జయసుధ భర్త నితిన్‌కపూర్ నిర్మించిన ‘కలికాలం’ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించింది.
ఆ విజయం సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆ సినిమాలో సెన్సేషనల్ పాత్ర పోషించిన సాయికుమార్‌కి వచ్చిన షీల్ట్ అది.
షూటింగ్స్ కారణంగా సినిమాలో నటించిన సాయికుమార్ బిజీగా ఉండటంతో ( అవుట్ ఆఫ్ స్టేషన్) అవార్డును తీసుకొవటానికి
బుల్లి సాయికుమార్ ఆది, సాయికుమార్ నాన్న పి.జె శర్మగారితో కలిసి ఆ వేడుకలో పాల్గొన్నారు.
మెగాస్టార్ అంటే ఆదికి పిచ్చి ప్రేమ అని తెలిసిన చిరంజీవి ఇలా ఎత్తుకుని నాన్న సాయికుమార్ అవార్డుని తనయునికి అందించారు.
ఇది ఆ ఫోటో వెనుక కథ. తర్వాత ఆ సినిమాని అనేక భాషల్లో పునర్ నిర్మించారు.
ఆదికి అప్పుడు నాలుగేళ్లు నిండి ఐదేళ్లు ఉంటాయి అంతే…చిరంజీవిని చూసిన ఆనందంలో అప్పుడే హీరో ఫోజు పెట్టాడు మనోడు…
శివమల్లాల
Also Read This : తాతగారంటే ఎంత ప్రేమోకదా నందమూరి మనమళ్లకు…
