ఓరి మ్లేచ్యుడా అంటూ ఈ ఇడియట్‌ అందరికి మాస్‌ మహరాజయ్యాడు….

ప్యాషన్‌ పేషన్స్‌ పర్‌ఫార్‌మెన్స్‌కి ఓనరితను…
ఒంటరిగా వచ్చి గ్రౌండ్‌లో నిలుచున్నాడు..
ఆట ఆడాలనుకున్నాడు…
ఓపికగా వెయిట్‌ చేసి.. నిలుచున్నాడు..
ఆడాడు..ఆడాడు..ఆటలో ప్రావీణ్యం సంపాదించాడు..
గెలిచాడు..మామూలు గెలుపు కాదది..
పదిమంది మెచ్చే గెలుపు..వందల మంది ఫాలో అయ్యే గెలుపు.
విన్నర్‌గా నిలిచాడు..మాస్‌ మహరాజయ్యాడు..
ఆడాలనుకున్న ఆట సినిమా ఆట..
ఇండస్ట్రీలో నిల్చోవటానికి చిన్నచిన్న పాత్రలతో సావాసం..
నటునిగా గొప్ప అవకాశాలు రావటంలేదు..
దర్శకునిగా లక్‌ ట్రై చేద్దామని అసిస్టెంట్‌ దర్శకునిగా మారి..
తనలా వచ్చిన టాలెంటెడ్‌ పీపుల్‌కి ఆసరా అవ్వలనుకున్నాడు..
ఇన్ని చూశావ్‌..ఇంతలా వెయిట్‌ చేశావు…
నిన్ను స్టార్‌ని చేస్తా నన్ను నమ్మురా ఇడియట్‌ అన్నాడు..
సరే అని పూర్తిగా నమ్మేశాడతన్ని..అంతే ఇడియట్‌ అయ్యాడితను…
తన జీవితంలోకి భగవంతునిలా ఎంట్రీ ఇచ్చారు దర్శకుడు పూరి..
ఆరోజే తాను పడిన కష్టాలన్నింటికి ఫుల్‌స్టాప్‌…
మిగిలిన లైఫంతా బోనస్సే…ఇది రవితేజ రియల్‌ ఖలేజా..
ఎన్ని నిద్ర లేని రాత్రులో..ఆకలితో అలమటించిన రోజులో..
అవమానాలు..అభిమానాలు..ఆవేశాలు…ఆనందాలు..
అన్ని మూట కట్టుకుని ఒకచోట ఉంటే అదే ఫిల్మ్‌నగర్‌..
మొత్తానికి ఫిల్మ్‌నగర్‌లో జాగా చూసుకుని పాగావేశాడు…

హీరోగా 26 ఏళ్లు..26న పుట్టినరోజు…75 సినిమాలకు కేరాఫ్‌ ఆడ్రస్‌..మాస్‌ హీరో రవితేజ ఈ పుట్టినరోజుకి ‘మాస్‌జాతర’ చేసుకుంటున్నాడు.

57 ఏళ్లు పూర్తి.. తన స్టార్‌మారినా తాను స్టార్‌గా మారిన ఎకౌంట్‌లో ఎమౌంట్‌ పెరిగినా కానీ గుండెల్లో నటించాలన్న తపన మాత్రం తగ్గలేదు.

హిట్‌ ఫ్లాప్‌తో సంబంధమే లేని మేలిమి బంగారం. హిట్టొచ్చినా ఇక్కడే, ఫ్లాపొచ్చినా ఇక్కడే…అందుకే వాటన్నింటికి ఆమడ దూరం ఈ రాజు గారు.

ఓరి మ్లేచ్యుడా అంటూ ప్రేక్షకుల మనసులో స్థానం పొందిన మన తెలుగు ‘ఇడియట్‌’ హీరో రవితేజకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తుంది ట్యాగ్‌తెలుగు.కామ్‌.

శివమల్లాల

Also Read This : వైఎస్ వివేకాని చంపించింది కూతురు అల్లుడేనా ?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *