Hatya Review :
రివ్యూ : హత్య
విడుదల తేది : 24–1–2025
నటీనటులు : ధన్య బాలకృస్ణ, రవివర్మ, పూజా రామచంద్రన్, రఘు, భరత్ తదితరులు
ఎడిటర్ : అనిల్ కుమార్ పి
సినిమాటోగ్రఫీ : అభిరాజ్ నాయర్
సంగీతం : నరేశ్ కుమరన్ పి
నిర్మాత : ప్రశాంత్ రెడ్డి
కథ–స్క్రీన్‌ప్లే– దర్శకత్వం : శ్రీవిద్య బసవ
సినిమా ఎలా ఉంది?
ఈ సినిమా రివ్యూముందు సినిమాలో మాట్లాడిన పేర్లన్నింటికి మారుపేర్లు పెట్టటం జరిగింది.
ఉదాహరణకు జె.సి ధర్మేంధ్ర అంటే వైయస్ వివేకానందరెడ్డి, జె.సి కిరణ్ అంటే వైయస్ జగన్‌మోహన్ రెడ్డి,
కవిత అంటే సునీత (వివేకానంద కూతురు) వెంకటేశ్ అంటే అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి రామకృష్ణ రెడ్డి ఇలా అనేక పేర్లను మార్చి సినిమాలో చూపించినప్పటికి
వివేకా హత్య గురించి కొద్దోగొప్పో అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి ఒరిజినల్ క్యారెక్టర్స్ గుర్తుకువస్తాయి.
కథ:
మార్చి 15న 2019లో జరిగిన మాజీ యం.పి వివేకానందరెడ్డి హత్య ఉదంతాన్ని తన కథా వస్తువుగా తీసుకుని చేసిన సినిమా ఇది.
సినిమా ప్రారంభంలోని మొదటి సీన్‌లోనే జె.సి ధర్మేంధ్ర హత్య జరుగుతుంది.
వై.యస్ వివేకా పేరును జె.సి ధర్మేంధ్రగా మార్చినప్పటికి (రవివర్మ) సినిమా చూస్తున్న అందరిమదిలో ఈ పాత్ర వివేకానే చూస్తున్నట్లుగా ఉంటుంది.
కథగా ఈ రివ్యూలో చెప్పటానికి ఏమిలేదు. అందరికి తెలిసిన ఉదంతమే అయినా కొన్నిచోట్ల చాలా తప్పులు దొర్లాయేమో అనే అనుమానం సినిమా చూస్తున్నవారికి కలుగుతుంది.
ఈ కథను పూర్తిగా ఎవరివైపు తీసుకుని దర్శకురాలు చెప్పిందో చివరి రీలు వరకు ఎవరికి అర్థంకాదు.
క్లైమాక్స్‌లో ఆమె ఎటువైపు తీసుకుని కథను మలిచిందో అనే పాయింట్ మాత్రం ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ పాయింటే అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ముఖ్యంగా ఇటువంటి కథ చెప్తున్నప్పుడు రెండు వర్గాలుగా సినిమాని చూడాల్సి వస్తుంది.
రాజకీయంగా ఓ వర్గాన్ని సపోర్టు చేసినట్లుగా మరో వర్గానికి అనిపిస్తేమాత్రం మరో వర్గం తప్పనిసరిగా ఈ కథను విభేదిస్తారు.
అన్నింటికి మించి సెకండ్‌హాప్‌లో వచ్చే వివేకా లవ్‌స్టోరీని చెప్పటంలో దర్శకురాలు తెలివిని మెచ్చుకోకుండా ఉండలేం.
ఎంతో పకడ్భందీగా తాను రీసెర్చ్ చేసి కథను చెప్పిందా? అన్నట్లుగా వివేకా లవ్‌స్టోరీ ఉంటుంది.
శ్రీవిద్య చెప్తున్న కథకు కనెక్టింగ్ పాయింట్స్ అన్ని వచ్చి ఒక దగ్గర ఆగటంతో ఆమె దర్శకురాలుగా పుల్‌గా సక్సెస్ అని చెప్పాలి.
కారణం తను చెప్పిన కథ నిజమైన కథో కట్టుకథో ప్రేక్షకునికి అర్థం అయ్యి అర్థంకానట్లుగా ఉంటూనే ‘హత్య’ వెనుక దోషులు వీళ్లే అని ఆమె లోని దర్శకురాలి కోణాన్ని బయటపెట్టింది.
ఇంతవరకు పూర్తిగా జడ్టిమెంట్ వెలువడని ఈ కేసులో న్యాయం ఎటువైపు దోషులు ఎవరు అనేది మిలియన్ డారర్ల ప్రశ్నే ఇప్పటికి.
నటీనటుల పనితీరు:
రవివర్మ వైయస్ వివేకానందరెడ్డిలా చక్కగా కుదరటానికి చాలా హోమ్‌వర్క్ చేసినట్లు కనిపించింది.
కారణం వివేకా హైట్ చాలా తక్కువగా ఉంటారు. రవివర్మ దాదాపు ఆరడుగులపైనే ఉంటారు.
అందుకే రవి ఆ పాత్రను చాలెంజింగ్‌గా తీసుకుని నటించారేమో అనిపిస్తుంది.
సిట్ ఆఫీసర్ సుధారావు పాత్రలో నటించిన ధన్య బాలకృష్ణకు తనకు అసిస్టెంట్ పోలీసాఫీసర్‌గా నటించిన రఘు పాత్రకు
వివేకా పాత్రలో నటించిన రవివర్మ పాత్రతో పాటు మరికొన్ని పాత్రలు నిస్సందేహంగా అద్భుతంగా అనిపించాయి.
వీరందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. వివేకా లవర్‌గా నటించిన పూజా రామచంద్రన్ (సలీమా) క్యారెక్టర్‌ను అర్థం చేసుకుని పనిచేసిన తీరు బావుంది.
వివేక్ పి.ఏ పాత్రలో నటించిన కిశోర్‌రెడ్డి పాత్ర కూడా ఆకట్టుకుంది. మిగిలినవారందరూ వారి పాత్రల్లో పరావాలేదనిపించారు.
టెక్నికల్ విభాగం:
ఈ సినిమా టెక్నికల్ విభాగం అనగానే టక్కున గుర్తుకు వచ్చేది సంగీత దర్శకుడు.
ధన్య బాలకృష్ణ కనిపించిన ప్రతిసారి ఒక బీజియం వస్తుంది. ఆ బీజియం ఆకట్టుకుంది.
అలానే కెమెరా వర్క్‌కి కూడా మంచి మార్కులు పడ్డాయి.
ప్లస్ పాయింట్స్:
వివేకా లవ్‌స్టారీ
హత్య ఎలా చేశారు అనే పాయింట్
సంగీతం
మైనస్ పాయింట్స్:
కొన్నిచోట్ల స్లో పేస్
అవసరం లేని ఎలివేషన్లు
ఫైనల్ వర్డిక్ట్ :
జగన్ అభిమానులకు పండగే
ఈ దర్శకురాలు జగన్ వదిలిన మరో బాణం
రేటింగ్ : 2.75/5
శివమల్లాల
Also Read This :బిగ్ షాక్… ఆర్జీవీ కి 3నెలలు జైలు శిక్షా…
