రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ #SSMB29. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన చిన్న అప్డేట్ కూడా క్షణాల్లో వైరలవుతోంది.
అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో తాజాగా నటి ప్రియాంక చోప్రా హైదరాబాద్ చేరుకోవడం నెట్టింట వైరల్ గా మారింది.
హైదరాబద్ ఎయిర్ పోర్ట్ లో ప్రియాంక తన సెక్యూరిటీ సిబ్బందితో కలిసి కనిపించారు.
దీంతో మహేశ్- రాజమౌళి #SSMB29 ప్రాజెక్ట్ కోసమే ప్రియాంక హైదరాబాద్ చేరుకున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇటీవలే చిత్రబృందం పూజ కార్యక్రమాలతో సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. కానీ అధికారికంగా ఎలాంటి సమాచారాన్ని బయటపెట్టలేదు.
అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ మూవీలో పలువురు విదేశీ నటులు కూడా కనిపించనున్నట్లు సమాచారం.
ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇందులో మహేష్ బాబు ఇదివరకు ఎన్నడూ కనిపించని విధంగా సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు.
సంజు పిల్లలమర్రి
Also Read This : RC 16 సినిమా స్టోరీ లో మార్పులు చేసిన చిరంజీవి