గేదెలరాజు కాకినాడ తాలూకా ఏంటిది ?

సంగీతదర్శకుడు, నిర్మాత, నటుడు రఘుకుంచే టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గేదెలరాజు’. ‘కాకినాడ తాలుకా’ అనేది సినిమా సబ్‌టైటిల్‌.

నూతన దర్శకుడు చైతన్య మోటూరి దర్శకత్వంలో లవ్‌ అండ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతుంది.

కాకినాడ దగ్గరలో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రఘుకుంచే సమర్పిస్తుండగా వాణి రవికుమార్‌ మోటూరి నిర్మాత.

రవి చిన్నబిల్లి, వీరభద్రరావు తడాల సహ నిర్మాతలు.

రామచంద్రమ్‌ పుణ్యమంతుల,టీనా శ్రావ్య, శ్రీదివ్య, వికాస్, మౌనిక,

రవి చిన్నబిల్లి ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం టైటిల్‌లాంచ్‌ ఎనౌన్స్‌మెంట్‌ను హైదరాబాద్‌లో చిత్రయూనిట్‌ విడుదల చేసింది.

ప్రస్తుతం కాకినాడ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది.

శ్రీకాంత్‌ అయ్యంగార్, మెహబూబ్‌ భాషా, కిట్టయ్య తదితరులు నటిస్తున్నారు. అనేక ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌తో తయారవుతున్న

ఈ సినిమాకి సంగీతం– రఘుకుంచే, డిఓపి– సాయికుమార్‌ దారా ఎడిటర్‌– సుధీర్‌ ఎడ్ల కోడైరెక్టర్‌– శేఖర్‌ కుంపట్ల పిఆర్‌వో–మూర్తి మల్లాల

కథ,కథనం, మాటలు, దర్శకత్వం– చైతన్య మోటూరి

Also Read This : సినీ పెద్దలకు సీఎం రేవంత్ షాక్

Raghu Kunche Exclusive Interview
Raghu Kunche Exclusive Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *