యూట్యూబ్ ప్రముఖ తెలుగు నటుడు ప్రసాద్ బెహెరా ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పెళ్లివారమండి, మా విడాకులు వెబ్ సిరీస్‌లతో తెలుగులో ఫుల్ పాపులారిటి సంపాదించుకున్న ప్రసాద్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు.
కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని.. తనతో వెబ్ సిరీస్‌లో నటించిన యువతి జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది.
ప్రసాద్ తనను కొద్ది నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని, షూటింగ్ సమయంలో తన ప్రైవేట్ భాగాలను తాకుతున్నాడని,
తనను బాడీ షేమింగ్ చేస్తున్నాడని వెబ్ సిరీస్ నటి జూబ్లీహిల్స్ పోలీసులకు ఈనెల 14న ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం ప్రసాద్ బెహరాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
యూట్యూబ్ లో మావిడాకులు, పెళ్లివారమండి లాంటి వెబ్ సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్.
తాజాగా కమిటీ కుర్రాళ్ళు సినిమా తీసి విజయం సాధించాడు.
బాధితురాలు ఫిర్యాదుతో ప్రసాద్ బెహరాను అరెస్ట్ చేసి పోలీసులు కోర్టులో హాజరపరచారు. ఆపై ప్రసాద్‌ను రిమాండ్‌కు తరిలించారు.
సంజు పిల్లలమర్రి