Chandrabose :
అక్షరాలతో మాలలు కట్టి పాటలు చేస్తాడు..
ఆ పాటలతో ప్రార్ధనలు చేపిస్తాడు..
తన పాటలలోని మాటలతో స్ఫూర్తిని నింపుతాడు..
ఆగిపోయే బతుకులకు ఆ స్ఫూర్తి మంత్రమే ఇంధనం..
పాటతో ప్రేమించటం నేర్పుతాడు..
పోరాడటం నేర్పుతాడు..
నీ జీవితానికి నువ్వే రాజు, మంత్రి, బంటు అంటాడు..
నీ చదువుకు పలక, బలపం, ప్రశ్న, బదులు అన్నీ నువ్వే..
ఇలాంటివి కొన్ని వేలు చెప్పి, కోట్ల మందికి దగ్గరయ్యాడు..
నాటు,నాటు, నాటు, నాటు అంటూ
140 కోట్ల మంది భారతీయులకు బంధువయ్యాడు..
ఆయనెవరో ఇప్పటికే అర్ధమయ్యేంటుంది..ఆస్కార్ విజేతని..
ఆకలి విలువ , అక్షరం విలువ ఔపోసన పట్టిన జ్ఙాని..
భారతమాత ముద్దుబిడ్డ…శ్రీ చంద్రబోస్ గారు.
చంద్రబోస్ గారితో ప్రత్యేక ఇంటర్వూ ఇన్ ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ చానల్..
ఎదగాలి అనుకునేవారికి ఈ ఇంటర్వూ నిచ్చెనలా ఉంటుంది అని భావిస్తూ ఆశయంతో ముందుకు వెళ్లే అందరూ ఎదగాలని కోరుకుంటూ…ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This : నా జన్మలో ఆర్జీవీతో పనిచేయను…