Prabhas : ఫ్యాన్స్ కి ప్రభాస్ ఇంట్రెస్టింగ్ న్యూస్

Prabhas :
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు.
ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ పై విజయ్ కిరగాందూర్ దీనిని ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఇక రిలీజ్ అనంతరం పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న సలార్ మూవీ ప్రస్తుతం అన్ని ఏరియాల్లో కూడా బాగానే కలెక్షన్ తో కొనసాగుతోంది.
బాహుబలి 2 మూవీ తరువాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో ఆశించిన స్థాయి సక్సెస్ అందుకోలేకపోయిన సలార్ తో పెద్ద విజయం అందుకోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అమితానందంలో ఉన్నారు.
ఇక భారీ మాస్ యాక్షన్ మూవీ సలార్ కి బి, సి సెంటర్ల ఆడియన్స్ నుండి మంచి స్పందన లభిస్తోంది.
మరోవైపు నాగ అశ్విన్ తో కల్కి 2898 ఏడి, మారుతీ తో ఒక సినిమాతో పాటు త్వరలో సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే మూవీ కూడా చేయనున్నారు ప్రభాస్.
వీటితో పాటు అతి త్వరలో హను రాఘవపూడితో కూడా ఒక సినిమా చేసేందుకు సిద్దము అవుతున్నారు ప్రభాస్.
ఇక ఈ సినిమాలు అన్నిటి పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
Prabhas_Salaar
Prabhas_Salaar
విషయం ఏమిటంటే, తాజాగా ఒక ప్రముఖ హిందీ పత్రిక వారికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రభాస్.
ఈ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ సలార్ ఇంత పెద్ద సక్సెస్ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
ఇక ప్రస్తుతం దానికి సీక్వెల్ అయిన సలార్ 2 స్టోరీ లాక్ అయి ఉన్నప్పటికీ కూడా అది ఇప్పటికిప్పుడు తెరకెక్కుతుందా లేదా అనేది చెప్పలేనని,
కొంత టైం అయితే పెట్టె అవకాశం ఉందని తెలిపారు.
ఇక తాను యువ దర్శకుడు నాగ అశ్విన్ తో చేస్తున్న కల్కి 2898 ఏడి మూవీ ఫ్యూచరిస్టిక్ ఆలోచనలతో ఎంతో గ్రాండ్ గా సైన్స్ ఫిక్షన్ జానర్ లో రూపొందుతోందని,
అలానే మరోవైపు మారుతీ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ హర్రర్ జానర్ తో కూడిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలిపారు.
తాను ఎక్కువగా ప్రస్తుతం చేస్తున్న ప్రాజక్ట్స్ పైనే దృష్టి పెట్టానని, తప్పకుండా అవి కూడా మిమ్మల్ని అందరినీ అలరిస్తాయనే ఆశాభావం ఆయన వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *