Guntur Kaaram :
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో దాదాపుగా పదమూడేళ్ల అనంతరం వస్తున్న మూవీ కావడంతో గుంటూరు కారం పై అందరిలో కూడా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన హారిక హాసిని క్రియేషన్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మస్తున్న ఈమూవీలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జయరాం, జగపతిబాబు, రఘుబాబు, సునీల్
తదితరులు ఇతర కీలక పాత్రలు చేస్తుండగా యువ సంగీత తరంగం థమన్ సంగీతం అందిస్తున్నారు.
ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ తో పాటు మహేష్ బాబు ఇమేజ్ కి తగ్గట్లు తొలిసారిగా మంచి మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ని కూడా జోడించి ఈ మూవీ తెరకెక్కుతోంది.
ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ దగ్గరి నుండి ఇటీవల మూడు సాంగ్స్ తో పాటు ఫస్ట్ లుక్ మాస్ స్ట్రైక్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా అవి అన్ని కూడా బాగా రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి.
ముఖ్యంగా ఇటీవల రిలీజ్ అయిన మాస్ సాంగ్ కుర్చీ మడతపెట్టి కి యువత తో పాటు మాస్ ఆడియన్స్ నుండి విపరీతంగా రెస్పాన్స్ వస్తోంది.
అటు యూట్యూబ్ తో పాటు ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ సాంగ్ కి బాగా రీల్స్ కూడా వస్తున్నాయి. రేపు థియేటర్స్ లో కుర్చీ మడతపెట్టి సాంగ్ కి రచ్చ అదిరిపోతుందని చెప్తున్నారు మేకర్స్.
ఇక తాజాగా గుంటూరు కారం మూవీ యొక్క అఫీషియల్ రన్ టైం మరియు సెన్సార్ డీటెయిల్స్ ఫిక్స్ అయ్యాయి. దాని ప్రకారం ఈ మూవీ 2 గం. 39 ని. ల పాటు సాగనుండగా దీనికి సెన్సార్ వారు యు / ఏ సర్టిఫికెట్ ని అందించారు.
ముఖ్యంగా సెన్సార్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం గుంటూరు కారం మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం నమోదు చేస్తుందని తెలుస్తోంది.
ఇక గతంలో తామిద్దరి కలయికలో వచ్చిన అతడు మూవీ పెద్ద సక్సెస్ అందుకున్నప్పటికీ అనంతరం వచ్చిన ఖలేజా మాత్రం సక్సెస్ కాకపోవడంతో
తదుపరి చేస్తున్న గుంటూరు కారం పెద్ద సక్సెస్ అవ్వాలనే దిశగా దీనిని ఎంతో జాగ్రత్తగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించారట.
మొత్తంగా అయితే బాగా హైప్ ఏర్పరిచిన గుంటూరు కారం మూవీ కోసం అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోన్న ఈ మూవీ ట్రైలర్ ని రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసి అనంతరం సినిమాని గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో జనవరి 12న విడుదల చేయనున్నారు మేకర్స్.
Also Read : ఆడ్వాణీ ఎన్నాళ్లకుగుర్తొచ్చాడు మోదీ..?