సెప్టెంబర్ 25న ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రీరిలీజ్ కానుంది…

మార్వెల్ అభిమానులకు గుడ్ న్యూస్. మార్వెల్ స్టూడియోస్ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’ సినిమాకు బుకింగ్స్ ఓపెన్ చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 25, 2026న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రీరిలీజ్ కానుంది. ఈసారి ‘ఎండ్‌గేమ్’ను ఐమాక్స్, ఇన్ఫినిటీ విషన్ సమర్పణలో మార్వెల్ స్టూడియోస్, 4DX, MX4D, SCREEN X, డాల్బీ విషన్, HDR BARCO, ICE వంటి ప్రీమియం ఫార్మాట్లలో ప్రేక్షకులు చూడొచ్చు. పెద్ద స్క్రీన్లు, బ్రైట్ ఇమేజ్, అద్భుతమైన సౌండ్‌తో ప్రేక్షకులకు మరింత గ్రాండ్ థియేట్రికల్ అనుభూతిని అందించనున్నారు.

ముఖ్యంగా ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’లో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ లుక్‌ను కూడా చూపించనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 18, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

Telugu trailer : https://youtu.be/nWeU0KKy-DY?si=HFGAaGPXY47Pux2-

‘ఎండ్‌గేమ్’ కథలో థానోస్ కారణంగా విశ్వంలోని సగం జనాభా నాశనం అవుతుంది. మిగిలిన సూపర్ హీరోలు ఆ విషాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తారు. చివరికి తమ ప్రియమైన వారిని తిరిగి తీసుకురావడంతో పాటు విశ్వంలో శాంతి, సమతుల్యతను పునరుద్ధరించేందుకు థానోస్‌తో తలపడాల్సి వస్తుంది.

కెవిన్ ఫైజ్ ఈ చిత్రాన్ని నిర్మించగా, ఆంథోనీ రస్సో, జో రస్సో దర్శకత్వం వహించారు. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’ సెప్టెంబర్ 25న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో IMAX సహా అన్ని ప్రీమియం ఫార్మాట్లలో విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *