ఈనెల 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “చిరంజీవి” సినిమా

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా “చిరంజీవి”. ఈ చిత్రంలో ఈశ్వరి రావు, తనికెళ్ల భరణి,శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను కికు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు. శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు.”చిరంజీవి” సినిమా ఈ నెల 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ చిత్ర స్నీక్ పీక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

“చిరంజీవి” సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే – చిరంజీవి అనే యువకుడు డెక్స్ట్రోకార్డియా (కుడివైపు గుండె ఉండే అరుదైన పరిస్థితి)తో బాధపడుతుంటాడు. అతన్ని ప్రాణంగా ప్రేమిస్తుంది హీరోయిన్. ఈ జంట సన్నిహితంగా ఉన్న సమయంలో కుడివైపు గుండె కొట్టుకునే చిరంజీవికి సాధారణంగా అందరిలాగే ఎడమవైపుకి గుండె లయను గమనించి ఆశ్చర్యపోతుంది హీరోయిన్, ఈ ట్విస్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.
చివరలో గ్రే షేడ్ లో హీరోను చూపిస్తూ ప్రేక్షకులను ఎంగేజ్ చేసే అన్ని ఎలిమెంట్స్ తో ఈ నెల 28న తెరపైకి రాబోతోంది “చిరంజీవి” సినిమా

నటీనటులు – కికు యనమల, కశిష్ ఖాన్, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ, తదితరులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *