10 ఏళ్ల ఔట్ స్టాండింగ్ కెరీర్ పూర్తి చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ

హీరో విజయ్ దేవరకొండ 10 ఏళ్ల అద్భుతమైన కెరీర్ ను కంప్లీట్ చేసుకున్నారు. ఆయన సోలో హీరోగా నటించిన తొలి సినిమా పెళ్లి చూపులు 2016లో ఇదే రోజు రిలీజైంది. అప్పటికే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించి పేరు తెచ్చుకున్న విజయ్..పెళ్లి చూపులు సినిమాతో సోలో హీరోగా అరంగేట్రం చేశారు. మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల ప్రేమాభిమానాలు సంపాదించుకుని, బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కొట్టారు విజయ్. ఈ సినిమా విజయంతో ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. టాక్సీవాలా, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, ఫ్యామిలీ స్టార్, ఖుషి, కింగ్డమ్ ఇలా..వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు విజయ్ దేవరకొండ. ప్రభాస్ కల్కి సినిమాలో అర్జునుడి పాత్రలో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చారు. భారీ చిత్రాలు చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా స్పాన్ పెరగడంలో తన వంతు కృషి చేస్తున్నారు విజయ్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిన్న సినిమాతో కెరీర్ మొదలుపెట్టి పెద్ద స్టార్ గా ఎదిగిన విజయ్ ప్రస్థానం ఎంతోమంది కొత్త వాళ్లకు ఇన్సిపిరేషన్ గా నిలుస్తోంది.

విజయ్ ఈ పదేళ్లలో సాధించింది ఒక హిస్టరీ. ఈ దశాబ్దకాలంలో జయాపజయాలు, ఎత్తుపల్లాలు, ప్రేమ, ద్వేషం ఎదుర్కొన్నారు విజయ్. మరే హీరో చూడనంత వెర్సటైల్ కెరీర్ చూశారు. రౌడీ వేర్ బ్రాండ్ తో ఒక వ్యాపారవేత్తగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతూనే, ది దేవరకొండ ఫౌండేషన్ తో పేద మధ్య తరగతి వారికి సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతిభ గల 180 మంది పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందించారు. ఇలా విజయ్ స్టార్ గా ఎదగడమే కాదు వ్యక్తిగతంగా తన గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఇప్పుడు విజయ్ చేస్తున్న సినిమాలు ఆయన స్టార్ డమ్ మరింత పెంచడమే కాదు టాలీవుడ్ పేరు పాన్ ఇండియా స్థాయిలో మార్మోగేలా చేయబోతున్నాయి.

దిల్ రాజు – శిరీష్ నిర్మాణంలో రవికిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్థన మూవీ చేస్తున్నారు విజయ్. ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ నిర్మాణంలో రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రణబాలి సినిమా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *