అయ్యప్ప స్వామి సేవకునికి ప్రత్యేకమైన సత్కారం

దేవునికి నాకు మధ్య ఎలాంటి అడ్డుగోడ లేదు, నేను పుట్టిందే ఆ అయ్యప్పకి సేవ చేయటానికి అన్నట్లు, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు లాంటివి చేస్తూ నిత్యం ఆ శబరిమల వాసుడు అయ్యప్ప నామస్మరణనే స్మరిస్తూ తన జీవన సాగరాన్ని సాగిస్తున్నారు ఒక అర్చకులు. ఆయన ఎవరో కాదు హైదరాబాద్ లోని మన సనత్ నగర్ హనుమాన్ దేవస్థానం ఆవరణలోని అయ్యప్ప దేవాలయం లో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న శ్రీ నండూరు సత్యనారాయణ చార్యులు గారు. ఆయనను బేగంపేటలోని పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామి గారు సన్మానించారు. ఎందుకంటే అయ్యప్ప మాల ధరించిన స్వాములకు ఆయన ఇచ్చే ఉపదేశాలు మరియు గుడికి వచ్చే నిత్య భక్తులకు ఆయన ఇచ్చే సూక్తులకు మెచ్చి, ముఖ్యంగా ఆ అయ్యప్పను మైమరిపించే పూజా విధానానికి మెచ్చి సత్యనారాయణ చార్యులు గారికి అవార్డు ఇచ్చి సత్కరించినట్లు అక్కడ ప్రతినిధులు వెల్లడించారు. నండూరు సత్యనారాయణ చార్యులు గారు మా టాగ్ తెలుగు ఛానల్ నందు అయ్యప్ప స్వామి గురుంచి, మాలధారణ గురుంచి ఎన్నో వీడియోస్ చేశారు. ఈ శుభసందర్భం లో మా టాగ్ తెలుగు ఛానల్ మరియు వెబ్సైట్ నుంచి ప్రత్యేక విషెస్ తెలియచేస్తున్నాం ఆయన ఇలాంటి మరెన్నో అవార్డులు సత్కారాలు పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *