“తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘ఊరు సాంగ్’ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ”. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా నుంచి ‘ఊరు సాంగ్’ రిలీజ్ చేశారు. వంశీకాంత్ రేఖన బ్యూటిఫుల్ గా కంపోజ్ చేసిన ఈ పాటకు సనరే సాహిత్యాన్ని అందించారు. మమత రమేష్ పాడారు. ‘ఊరు సాంగ్’ ఎలా ఉందో చూస్తే – ‘కొమ్మ కొమ్మల్లో కోయిల కూయంగ, తెల్లవారే మా పల్లె పచ్చపచ్చంగ, ఎచ్చని ఎలుగు సీరే కట్టె సక్కంగ, ముగ్గుల పూలు పెట్టి మెరిసే అందంగ, గడపల తోరణాలే గంతులు వేసెనుగా, పువులా పరిమళాలే గాలులు వీచెనుగా, ముస్తాభవుతున్నాదీ శివరాతిరి పండక్కి ఊరు, చిన్నా పెద్దల్లోన మొదలయ్యెను జాతర జోరు..’అంటూ ఆహ్లాదకరమైన పల్లెటూరిలో జరిగే శివరాత్రి జాతర సందడిని, ఆ పండక్కి ఊరు ప్రజలంతా సన్నద్ధమయ్యే తీరును వర్ణిస్తూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట.

నటీనటులు – సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్, తదితరులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *