GMAA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై “R” చిత్ర ప్రారంభం

GMAA ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్లో శిరీష గారి సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం “R”. గోలి రామకృష్ణ దర్శక నిర్మానంలో వస్తున్న ఈ చిత్రానికి గాలి బాల కిరణ్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ చిత్రం నేడు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో పూజ కార్యక్రమాలతో ఘనంగా మొదలు కావడం జరిగింది. సంతోష్ కృష్ణన్, భాగ్య రెడ్డి, బ్రహ్మానందం రెడ్డి, దుర్గమ నాయుడు, పవన్, సిరి, సంధ్య, భాను చందర్, స్వాతి తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి సినిమాలోగ్రాఫర్ గా అశోక రెడ్డి కంకల్ల, ఎడిటర్ గా మునీష్, కొరియోగ్రాఫర్ గా శివాజీ, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ గా కడవకల్లు గణేష్, అసిస్టెంట్ డైరెక్టర్గా వేదాంత్ రాజ్ అందే వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈనెల 20వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ సంవత్సరంలోనే అక్టోబర్ 17వ తేదీన “R” చిత్రం విడుదల కానుందని మేకర్స్ తెలిపారు.

గోలి రామకృష్ణ మాట్లాడుతూ : “ఈ చిత్రాన్ని రెండు షెడ్యూల్స్ లోనే మాకు ఉన్న స్క్రిప్ట్ తో, నటీనటుల సహకారంతో చిత్ర షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పూర్తి చేస్తాము. మంచి సందేశాత్మకమైన చిత్రంగా మీ ముందుకు అక్టోబర్ 17వ తేదీన R చిత్రం రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర విషయాలు త్వరలోనే ఒక విభిన్నమైన శైలిలో తెలియజేస్తాము” అన్నారు.

సహ నిర్మాత గాలి బాల కిరణ్ రెడ్డి మాట్లాడుతూ : “మా దర్శకునికి సినిమా పై ఉన్న మక్కువకు చిత్ర విడుదల తేది కూడా ఇప్పుడే వెల్లడించడం జరిగింది” అన్నారు.

నటీనటులు : సంతోష్ కృష్ణన్, భాగ్య రెడ్డి, బ్రహ్మానందం రెడ్డి, దుర్గమ నాయుడు, పవన్, సిరి, సంధ్య, భాను చందర్, స్వాతి తదితరులు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *