వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’. యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ మూవీని డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఆడియెన్స్‌ను మెప్పించాయి.
ఇక తాజాగా ‘శంబాల’ కథను కాస్త రివీల్ చేసేలా, హీరో ఫ్యామిలీ గురించి, ఆ ఫ్యామిలీకి వచ్చిన కష్టం గురించి చెప్పె ‘పదే పదే’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను గమనిస్తే సినిమాలో హీరో ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీకి హీరో ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటో ‘ముగ్గురైనా ఒక్కటేగా’ అంటూ పాటలో చేర్చిన పదాన్ని గమనిస్తే అర్థం అవుతుంది. ఇక ఈ పాటను వింటే కళ్లలో నీళ్లు వచ్చేలా, గుండెలో తడి ఏర్పడేలా ఉంది. ఎమోషనల్‌గా సాగే ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో అందరి హృదయాల్ని హత్తుకుంటోంది.
ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యం, యామిని ఘంటసాల గాత్రం, శ్రీ చరణ్ పాకాల బాణీ చక్కగా కుదిరాయి. విన్న వెంటనే మనసుల్ని తాకేలా సాగే ఈ పాట ఇప్పుడు ‘శంబాల’ మీద మరింత హైప్‌ను పెంచి, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది.
ఇప్పటికే ‘శంబాల’ మేకర్లకు లాభసాటి ప్రాజెక్ట్‌గా మారింది. అన్ని రకాల హక్కులు హాట్ కేకులా అమ్ముడయ్యాయి. రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్స్‌తో నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు. డిసెంబర్ 15న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.
నటీనటులు : ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్, స్వాసిక విజయ్, మధునాదన్, రవివర్మ, మీసాల లక్ష్మణ్, షిజు మీనన్, హర్ష వర్ధన్, శివ కార్తీక్, ఇంద్రానియల్, శైలజ ప్రియ, చైత్ర, రామరాజు, అన్నపూర్ణ అమ్మ, ప్రవీణ్, రంగధం, శ్రావణ సంధ్య తదితరులు