Nagarjuna: నా కెరీర్‌లో తొలిసారి లోకేశ్‌ కథ చెబుతుంటే రికార్డు చేశా

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో రూపొందిన చిత్రం ‘కూలీ’. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో నాగార్జున, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్, ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ‘‘నిన్నేపెళ్లాడతా’ చేసిన తర్వాత ‘అన్నమయ్య’ చేస్తుంటే.. ‘ఇప్పుడెందుకు ఇలాంటి కథ’ అని కొందరు నిరుత్సాహ పరిచే ప్రయత్నం చేశారు. అయితే నాకు కొత్తదనం ఇష్టం. సెట్‌కు వెళ్లాక బోర్‌ కొట్టకూడదంటే డిఫరెంట్ పాత్రలు చేయాలి. ఆ ప్రయత్నంతోనే ఇంతకాలం పని చేశాను. కొన్ని దెబ్బలు తిన్నా. మంచి మంచి విజయాలూ అందుకున్నాను. ఒకరోజు లోకేశ్‌ నన్ను కలిసి ‘మీరు విలన్‌గా చేస్తానంటే మీకో కథ చెబుతా. లేదంటే కాసిన్ని సినిమా కబుర్లు చెప్పి టీ తాగి వెళ్లిపోతా’ అన్నారు. లోకేష్ ‘ఖైదీ,’ విక్రమ్ నా ఫేవరట్ ఫిలిమ్స్. ఆ సినిమాలు చూసిన తర్వాత ఎప్పటికైనా ఈ దర్శకుడితో పనిచేయాలని బలంగా అనుకున్నా. ‘కూలీ’ కథ చెప్పిన తర్వాత నాకు చాలా నచ్చింది. ‘రజనీ స

స్పెషల్ వీడియో బైట్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ.. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు. ఈ సంవత్సరంలో లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో నేను నటించిన ‘కూలీ’ ఆగస్టు 14న రావడం సంతోషంగా ఉంది. కూలీ నా డైమండ్ జూబ్లీ పిక్చర్. తెలుగులో రాజమౌళి ఎలాగో తమిళంలో లోకేశ్‌ కనగరాజ్‌ అలా. ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఇందులో పలువు స్టార్స్‌ నటించారు. చాలాఏళ్ల తర్వాత సత్యరాజ్‌తో చేస్తున్నా. ఇక శ్రుతిహాసన్‌, ఉపేంద్ర, సౌబిన్‌లతో పాటు ఆమిర్‌ఖాన్‌ స్పెషల్‌ అపియరెన్స్‌ ఉంది. సౌత్ ఫిలిమ్స్ ఆయన ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున గారు ఇందులో విలన్‌గా చేస్తున్నారు. ‘కూలీ’ సబ్జెక్ట్‌ విన్న వింటనే సైమన్‌ పాత్ర నేనే చేయాలన్న ఆసక్తి కలిగింది. ఆ పాత్ర ఎవరు చేస్తారా? అని ఎదురుచూశా. ఎందుకంటే చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఆరు నెలల పాటు వెతికాం. ఈ పాత్ర గురించి ఒక యాక్టర్ తో ఆరుసార్లు సిటింగ్‌ అయింది. ఆయన్ని ఎలాగైనా ఒప్పిస్తాను అని లోకేశ్‌ నాతో అన్నారు. ‘ఎవరు ఆయన’ అని నేను అడిగా. నాగార్జున పేరు చెప్పగానే షాక్ అయ్యాను. ఆ తర్వాత ఆయన ఒప్పుకొన్నారని తెలిసి హ్యాపీగా అనిపించింది’’ అన్నారు.

డైరెక్టర్ లోకేష్ కనకరాజు మాట్లాడుతూ… ‘‘నాగార్జున గారిని ఈ సినిమాకి కన్విన్స్ చేయడం అనేది నాకు పెద్ద ఛాలెంజ్. దాదాపు 7 నరేషన్స్ ఇచ్చాను. ఫైనల్ గా ఆయన ఒప్పుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన ఈ సినిమాలో ఎంత అద్భుతంగా నటించారో మీరే చూడబోతున్నారు’’ అన్నారు. శృతిహాసన్ మాట్లాడుతూ… ‘‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్. రజనీకాంత్ గారితో వర్క్ చేస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదు కూడా. ఈ సినిమాలో అవకాశం రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. నాగార్జున గారు ఫెంటాస్టిక్ . ఆడియన్స్ అందరు కూడా ఆయన క్యారెక్టర్ని లవ్ చేస్తారు’’ అన్నారు. నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ… ‘‘లోకేష్ తీసిన ‘ఖైదీ, విక్రమ్’ సినిమాలు నాకు ఎంతగానో ఇష్టం. బ్యాడ్ బాయ్ క్యారెక్టర్‌లో నాగార్జునని చూడడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తన క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంది. ఆడియన్స్ కూడా చాలా మెస్మరైజ్ అవుతారు, యాక్సెప్ట్ చేస్తారు. ఈ సినిమా చాలా అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా టీమ్ అందరికీ గొప్ప సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను

సత్యరాజ్ మాట్లాడుతూ. అందరికి నమస్కారం. ఇది వెరీ బిగ్ ఫిలిం. ఈ సినిమాలో పార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. సూపర్ స్టార్ రజిని గారు కింగ్ నాగార్జున గారు శృతిహాసన్ అమీర్ ఖాన్ శోభిన్ వీళ్ళ అందరితో కలిసి నటించడం చాలా గొప్ప అనుభూతి’’ అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగు సినిమాలో నాగార్జున గారు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. ఫస్ట్ టైం లోకేష్ కనకరాజు డైరెక్షన్లో నెగటివ్ రోల్ చేస్తున్నారు. లోకేష్ గారు తన సినిమాలో ప్రతి క్యారెక్టర్ ని అద్భుతంగా డిజైన్ చేస్తారు. నాగార్జున గారు అన్నమయ్యతో ఒక కొత్త ట్రెండ్ ఎలా సెట్ చేశారో ఈ సినిమాతో ఇప్పుడు నెగిటివ్ రోల్ లో అలాంటి కొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్నారు. ఆయన నెగిటివ్ రోల్ లో కనిపించడం ఈ సినిమాకి చాలా పెద్ద ఎసెట్ కాబోతోంది. పుష్ప, కేజిఎఫ్ ఇలా ఎన్నో సినిమాల్లో మనం చూసాం. రజనీకాంత్ గారు బాషాని గుర్తు చేశారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ లో ఒక సెన్సేషన్ హిట్ కాబోతోంది’’ అన్నారు

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *