విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ “రణబాలి” మూవీ నుంచి మేకింగ్ గ్లింప్స్ రిలీజ్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ రోజు హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విశెస్ చెబుతూ “రణబాలి” మూవీ నుంచి స్పెషల్ మేకింగ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ హార్స్ రైడింగ్ కోసం ఎంతగా హార్డ్ వర్క్ చేశారు. ఎలాంటి కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నారు అనేది ఈ బర్త్ డే గ్లింప్స్ లో చూపించారు. స్టాలియన్ అనే బ్రీడ్ కు చెందిన గుర్రాలను స్వారీ చేయడం చాలా కష్టం. అయితే సినిమా కోసం ఎంతైనా కష్టపడే విజయ్…చాలా ప్రయత్నాలు చేసి, గాయాలకు తట్టుకుని సక్సెస్ ఫుల్ గా హార్స్ రైడింగ్ చేయడం ఈ గ్లింప్స్ లో ఆకట్టుకుంటోంది. ‘ఈ సన్నివేశాలు స్క్రీన్ మీద చూసేందుకు చాలా బాగుంటాయి, అందుకే ఇలాంటి కష్టతరమైన సీన్స్ చేస్తున్నాను..’ అని విజయ్ చెప్పడం ఆయనకు సినిమా మీద ఉన్న ప్యాషన్ ను తెలియజేస్తోంది. రణబాలి పాత్రలో విజయ్ చేసే హార్స్ రైడింగ్ సీన్స్, హార్స్ తో పాటు చేసే భారీ యాక్షన్ సీక్వెన్సులు ఈ మూవీలో హైలైట్ కానున్నాయి.

“రణబాలి” సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రాబోతోంది. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా “రణబాలి” సినిమా రూపొందుతోంది.

నటీనటులు – విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ, తదితరులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *