ఒక ప్రేమకథను ఇంత నీట్‌గా కూడా చెప్పొచ్చా? అని ప్రేక్షకుడు ఆలోచించేలా చేసిన చిత్రం ‘8 వసంతాలు’. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మౌత్ టాక్‌తో మంచి సక్సెస్ సాధించింది. అనంతిక సనీల్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో హను రెడ్డి, రవితేజ దుగ్గరాల, కన్నా కీలక పాత్రలు పోషించారు. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 11న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ‘8 వసంతాలు’ చిత్రం ఓ వర్గం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఎక్కడా వల్గారిటీకి తావు లేకుండా నీట్‌గా దర్శకుడు ప్రెజెంట్ చేశారు. సినిమా చూస్తున్నంత సేపూ ఓ ఫీల్ గుడ్ మూవీ చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
8 వసంతాలు మూవీ కథేంటంటే.. శుద్ధి అయోధ్య (అనంతిక) తల్లితో కలిసి ఊటీలో జీవిస్తూ ఉంటుంది. తండ్రి ఆర్మీలో పని చేస్తూ మరణిస్తాడు. తండ్రి మరణంతో ఆ బాధ నుంచి తేరుకునేందుకు రచయితగా మారుతుంది. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతూ సమయం దొరికినప్పుడల్లా ట్రావెల్ చేస్తూ పద్ధతిగా.. స్ట్రిక్ట్‌గా జీవిస్తూ ఉంటుంది. అలాంటి అమ్మాయి జీవితంలో వరుణ్ (హనురెడ్డి) వచ్చి ఆమెను ప్రేమలో పడేస్తాడు. అంతా ఓకే అనుకున్న సమయంలో వరుణ్ తన కెరీర్ కోసం శుద్ధికి బ్రేకప్ చెబుతాడు. ఆ తరువాత కథ ఏ మలుపు తీసుకుంది? ఆమె జీవితంలోకి వచ్చిన సంజయ్ (రవితేజ) ఎవరు? ఆమెతో అతనికున్న అనుబంధం ఏంటి? చివరకు శుద్ధి జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది? వంటి అంశాలతో ఈ చిత్రం రూపొందింది.