చరిత్రలో మరుగున పడిపోయిన కథలు ఎన్నో ఉన్నాయి. వాటిలో నుంచి తనకు తెలిసిన వ్యక్తి, 1980వ దశకంలో చరిత్ర పుటలో తనకంటూ ఓ పేజీని కేటాయించుకున్న వ్యక్తి కథను ఎంచుకుని దర్శకుడిగా మారాడు విక్రాంత్ రుద్ర. విజయ రామరాజును టైటిల్ రోల్‌లో పెట్టి సినిమా ఒక అద్భుతమైన స్పోర్ట్స్ డ్రామాను రూపొందించాడు. సినిమా పేరు ‘అర్జున్ చక్రవర్తి’. ఇప్పటి వారికి తెలియకపోయి ఉండొచ్చు కానీ 1980 దశకంలోని వారికి ఈ పేరు బాగా సుపరిచితం. అప్పటి కబడ్డి జట్టుకు నాయకత్వం వహించిన అర్జున్ చక్రవర్తి నల్గొండ వాసి. ఈతని చరిత్రను సినిమాగా తీసి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్. ఈ సినిమా విడుదలకు ముందే 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఈ రోజు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హను రాఘవపూడి సినిమా టీజర్ ని లాంచ్ చేశారు.
టీజర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ.. ‘‘ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వడానికి 9నెలలు మోస్తుంది. నేను కూడా ఈ సినిమాని మీకు చూపించడానికి తొమ్మిదేళ్లుగా మోశాను. నేను 12 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు ఒక పర్సన్ ని కలిసాను. ఆ పర్సన్ పేరు అర్జున్ చక్రవర్తి. ఆయన దగ్గర నేను కబడ్డీ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆయన ఒక కథ చెప్పారు. అది నా మనసులో అలాగా నాటుపోయింది. ఆ కథని ఎలాగైనా ప్రపంచానికి చెప్పాలి భావించాను. అలా ఈ కథ నేను డైరెక్టర్ కావడానికి డ్రైవ్ చేసింది. నిర్మాత శ్రీని గారికి కథ చెప్పిన తర్వాత ఆయనకి నచ్చింది. వెంటనే ఓకే చెప్పారు. మా హీరో విజయ్ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఎలాంటి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలన్నా అది చేసి చూపించారు. మైనస్ డిగ్రీల్లో షూట్ చేసాం. డిఓపి జగదీష్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసాడు. మేము అనుకున్నది తీయడానికి ఎంతకైనా సాహసించారు. సినిమాలో మ్యూజిక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉంటుంది. మా హీరోయిన్ సిజ్జా రోజ్ చాలా హార్డ్ వర్క్ చేసింది. సినిమా కోసం తెలుగు కూడా నేర్చుకుంది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. ఇది నా ప్రామిస్’’ అన్నారు.
హీరో విజయరామరాజు మాట్లాడుతూ.. ‘‘మ్యూజిక్. విజువల్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. హీరోయిన్ సిజ్జా ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. ఈ సినిమాతో తనకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. నేను ఏడాదిన్నర పాటు ప్రో కబడ్డీ టీమ్స్‌తో ట్రావెల్ అయ్యి రియల్ గా గేమ్ నేర్చుకుని ఈ సినిమా చేయడం జరిగింది. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం సిక్స్ ప్యాక్ చేయాల్సి వచ్చింది. నా జీవితంలో గుర్తుండిపోయే సినిమా ఇది. ఇంత మచి క్యారెక్టర్ ఉన్న సినిమా రావడం చాలా అరుదు. ఈ సినిమాలో నేను ఏదైనా పర్ఫామెన్స్ చేశానంటే అది మా డైరెక్టర్ గారి వల్లే. ఆయన అద్భుతంగా మలుచుకున్నారు. ఈ సినిమా క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది’’ అన్నారు
ప్రొడ్యూసర్ శ్రీని గుబ్బల మాట్లాడుతూ.. ‘‘డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. ఈ సినిమా కథ చెప్పినప్పుడు గానీ.. తీస్తున్నప్పుడు గానీ ఎక్కడ కూడా డ్రాప్ అయినట్లు అనిపించలేదు. అందుకే ప్రొడక్షన్ లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని చేయడం జరిగింది. విజయ్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. ఆయన హార్డ్ వర్క్ టీజర్‌లో మీరందరూ చూశారు. చాలా అద్భుతమైన విజువల్స్, ఎమోషన్స్, కథ ఉన్న సినిమా ఇది’’ అన్నారు. హీరోయిన్ సిజ్జా రోజ్ మాట్లాడుతూ… ‘‘ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. మీ అందరి సపోర్ట్ కావాలి. ఇది ఒక ఐదేళ్ల జర్నీ. చాలా ప్యాషన్ తో పని చేశాం. చాలా హార్డ్ వర్క్ చేశాం. మా నిర్మాత ఎంతగానో సపోర్ట్ చేశారు. ఆయన సపోర్ట్ లేకపోతే ఈ సినిమా అయ్యేది కాదు. మా డైరెక్టర్ గారు తన విజన్ ని అద్భుతంగా చూపించారు’’ అన్నారు.
ప్రజావాణి చీదిరాల