మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘బరి’. రీసెంట్‌గానే సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా వరుణ్ తేజ్ వాలీ బాల్ ఆటను ప్రాక్టీస్ చేస్తుండగా మోకాలికి తీవ్ర గాయమైంది. ఈ మోకాలి గాయానికి సంబంధించి వరుణ్ తేజ్‌కు శస్త్ర చికిత్స జరిగింది. ఈ విషయాన్ని నిహారిక తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
https://www.instagram.com/p/DXJkPxZk721
‘నా సోదరుడు వరుణ్ తేజ్ ఇటీవల మేం రూపొందిస్తోన్న బరి సినిమా కోసం వాలీబాల్‌ను ప్రాక్టీస్ చేస్తుండగా మోకాలికి తీవ్ర గాయమైంది. తాజాగా ఆయన్ని పరిశీలించిన డాక్టర్స్ మోకాలికి ఆపరేషన్ చేశారు. ఈ శస్త్ర చికిత్సను వైద్యులు చక్కగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేశారు. ప్రస్తుతం వరుణ్ అన్నయ్య డాక్లర్స్ పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే ఆయన పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటారని భావిస్తున్నాం. ఈ సమయంలో మాకు అండగా నిలబడి ప్రేమాభిమానాలు చూపించిన వారందరికీ ధన్యవాదాలు’ అని నిహారిక పేర్కొన్నారు.