తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మరోసారి వార్తల్లో నిలిచారు.
అయితే కొత్త సినిమా అప్‌డేట్ వల్ల కాదు, యాంకర్ రష్మీ గౌతమ్‌తో ఆయనకు సంబంధించి ఓ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో రాజమౌళి అపరిచిత వ్యక్తిగా రష్మీతో ఫోన్ ద్వారా సంభాషించడం, అనంతరం ఆమెను కలవడం వంటి దృశ్యాలు కనిపిస్తాయి.
ఇది చూసిన నెటిజన్లు “ఇది నిజంగా జరిగిందా?” అని ఆశ్చర్యపోతున్నారు. అయితే, వివరాలు పరిశీలిస్తే, ఇది ‘మా’ టీవీలో ప్రసారమైన ‘యువ’ అనే సీరియల్ ప్రమోషన్ కోసం రూపొందించిన ప్రత్యేక వీడియో అని తెలుస్తోంది.
ఈ సీరియల్‌ను అక్కినేని నాగార్జున నిర్మించగా, సబీహ దర్శకత్వం వహించారు. అప్పట్లో టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా ఉన్న రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యమయ్యారు.
ఇప్పుడీ వీడియో మళ్లీ వైరల్ కావడంతో, సినిమాపై ఉన్న ప్రజాదరణ మరోసారి రుజువైంది.
నిజంగా ఇది ఓ తాత్కాలిక ప్రచార వీడియో అయినప్పటికీ, రాజమౌళి హాస్యపూరిత శైలి, రష్మీ స్పందన నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
ఇప్పుడు ఈ వీడియోపై మీ అభిప్రాయమేమిటి?
సంజు పిల్లలమర్రి
Also Read This : ఈ లక్ష అనేక లక్ష్యాలకి నాంది..