ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారని నిజాంపేటలోని హోలిస్టిక్ హాస్పిటల్‌లో ఎమర్జెన్సీలో చేర్పించి ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. మోతాదును మించి నిద్రమాత్రలు తీసుకోవటంతో కల్పన అపస్మారక స్థితిలోకి చేరుకున్నారట. అసలేం జరిగింది? ఎప్పుడు జరిగింది? అని ప్రతి ఒక్కరూ ఆరా తీస్తున్నారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఫిలింనగర్ దావానంలా వ్యాపించటం సర్వ సాదారణం. మంగళవారం ఉదయం కల్పన కేరళనుండి వచ్చి నిజాంపేటలోని తన విల్లాలో మత్తు టాబ్లెట్స్ తీసుకుని పడుకున్నారట. ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికి తలుపు తీయకపోవటంతో అనుమానం వచ్చిన కల్పన స్నేహితులు ఆమె ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లి కాలింగ్‌బెల్ కొట్టినప్పటికి తలుపు
తీయకపోవటంతో డౌట్‌వచ్చి 100కి డయల్ చేసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారట. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని సమీక్షించి దగ్గరలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కల్పన సౌతిండియాలోని అన్ని భాషల్లోను పాడగలిగే నటి కావటంతో ఈ వార్త దేశమంతా వ్యాపించింది. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఆమె రెండవ భర్త ప్రభాకర్‌తో కలిసి నిజాంపేటలో నివాసం ఉంటున్నారని తెలిసింది. తన మొదటిభర్త రంజిత్ సంగీతదర్శకుడు మణిశర్మ వద్ద సౌండ్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. వారద్దరు వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. ఫైనాన్సియల్‌గా కల్పనకు ఎటువంటి ఇబ్బందులు లేవని ఆమెతో పాటు పనిచేసే కొంతమంది తెలియచేశారు. ఆమెకు ప్రాణహాని జరగకుండా త్వరగా కోలుకోవాలని చిత్రపరిశ్రమలోని మ్యుజీషియన్స్ అంతా కోరుకుంటున్నారు.