శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దండోరా’. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ తెలంగాణ నేపథ్యంలో రూపొందుతోన్న‘దండోరా’లో బలమైన ప్రేమ కథాంశంతో పాటు కఠినమైన నిజాలను, సమాజంలో కొనసాగుతోన్న సామాజిక దుష్పప్రవర్తలను ఈ సినిమా ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.
సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. టాలెంటెడ్ సింగర్ అదితి భావరాజు నటిగా ఈ చిత్రంతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇస్తోంది. ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్‌ను ఆలపించిన అదితి..‘దండోరా’ చిత్రంలో నటనా ప్రతిభను ప్రదర్శించనుంది. ఆమె ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. ‘దండోరా’ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తోంది. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో పలు కీలక షెడ్యూల్స్‌ను ఇప్పటికే పూర్తి చేశారు. ఇటీవల విడుదలైన మూవీ ఫస్ట్ బీట్ టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్నఈ సినిమాకు మార్క్ కె.రాబిన్ సంగీతం అందిస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల